కాజల్-గౌతమ్ ఎంగేజ్మెంట్ పిక్ వైరల్.. కాబోయే భర్త టాలెంట్‌ను ఆకాశానికెత్తేసిన చందమామ
అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి పీఠలెక్కబోతోంది. అక్టోబర్ 30న కుటుంబ సభ్యుల సమక్షంలో అంగ రంగవైభవంగా చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకోబోతోంది. గత కొన్ని రోజులుగా తన పెళ్లిపై వస్తోన్న వార్తలపై కాజల్ అధికారికంగా స్పందించింది . మామూలుగా అయితే అధికారికంగా ప్రకటించే కంటే ముందే ఓ హింట్ ఇచ్చింది. తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో ఓ లవ్ సింబల్‌ను పోస్ట చేసి పెళ్లి వార్తలపై పరోక్షంగా స్పందించింది.

అధికారిక ప్రకటన..
గౌతమ్ కిచ్లూ అనే వ్యాపార వేత్తను పెళ్లి చేసుకోబోతన్నట్టు కాజల్ ప్రకటించింది. అక్టోబర్ 30న ముంబైలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతుందని తెలిపింది. కోవిడ్ కారణంగా ఈ సెలెబ్రేషన్స్‌కు చాలా తక్కువ మందితో జరపబోతోన్నామని పేర్కొంది.

పెరిగిన ఫాలోయింగ్..
ఇక అందాల చందమామను సొంతం చేసుకున్న గౌతమ్ కిచ్లూ ఎవరబ్బా అని మన తెలుగు వాళ్లు గూగుల్‌లో బాగానే సర్చ్ చేశారు. అతని సోషల్ మీడియా ఖాతాల్లో ఫాలోవర్స్ కూడా క్షణక్షణానికి పెరుగుతున్నారు. మొత్తానికి ఇలా ప్రకటించేసరికి గౌతమ్ కిచ్లూ ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యాడు. అయితే వీరిద్దరూ చిన్నతనం నుంచే స్నేహితులని, చాలా ఈవెంట్లలో కలిసి పాల్గొన్నారని తెలుస్తోంది.

స్పెషల్ పిక్..
ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు డిజైనింగ్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటాడు. మొదటి సారిగా కాజల్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇది ఎంగేజ్మెంట్ పిక్ అని తెలుస్తూనే ఉంది. అయితే ఫోటోకు కాజల్ ఇచ్చిన రిప్లై ఓరేంజ్‌లో వైరల్ అవుతోంది.
Recommended Video

ఇందులోనూ నీ ప్రతిభ..
గౌతమ్ షేర్ చేసిన ఆ పిక్‌లో ఎంతో స్పెషల్ ఉంది. అందులో డిజైన్స్, ఆ ఫోటో, ఆ బెలూన్స్ ఇలా అన్నీ వెరైటీగా ఉన్నాయి. ఇదే విషయాన్ని కాజల్ చెబుతూ.. ఈ పోస్ట్ కూడా నీలోని డిజైనర్‌ను ప్రతిబింబిస్తోంది గౌతమ్ కిచ్లు.. కళాత్మక హృదయం ఉన్న నాకు కాబోయే మొగుడా అంటూ ప్రేమను కురిపించింది.


Click it and Unblock the Notifications











