Live Telecast Trailer.. దెయ్యంతో కాజల్ అగర్వాల్ ఆటలు
కాజల్ అగర్వాల్ దెయ్యంగా మారిపోతోన్నట్టు కనిపిస్తోంది. దెయ్యం కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలన్నీ కూడా వర్కవుట్ అవుతాయని చెప్పలేం. ఒక్కోసారి ఆ ఫార్మూలా కూడా బెడిసి కొడుతుంది. కనీసం కరెక్ట్‌గా నవ్వించడం, భయపెట్టడం వంటివి చేస్తే అది కాసుల వర్షాన్ని కురిపిస్తుంటుంది. అలా ఎన్నో చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయితే ప్రస్తుతం కాజల్ కూడా దెయ్యం కథల్లోకి వచ్చేసింది. హారర్ బేస్ట్ వెబ్ సిరీస్‌లో కాజల్ నటించడం ఇదే మొదటి సారి.
Live Telecast అంటూ రాబోతోన్న కాజల్.. ఇందులో టీవీ రిపోర్టర్‌గా పని చేస్తుంది. టీఆర్పీ కోసం సెన్సేషనలిజం కోసం దెయ్యాలను లైవ్‌లో కవర్ చేసి చూపిస్తామనే ప్రోగ్రాంను పెట్టేలా ఉంది. అయితే ఇందులో దెయ్యంగా నటించేందుకు కూడా తమలోని ఓ వ్యక్తిని రెడీ చేస్తారు. అలా ఓ ఇంట్లోకి వెళ్లిన కాజల్ అండ్ టీం దెయ్యాలను లైవ్‌లో చూపిస్తామని చెబుతుంటారు. అయితే అదే టైంకు కథ యూటర్న్ తిరిగేలా ఉంది.

అలా దెయ్యాన్ని లైవ్ టైలికాస్ట్‌లో చూపిస్తామని అనుకున్న కాజల్ బృందానికి నిజంగానే దెయ్యం ఎదురవుతుంది.వారందరినీ కూడా అదే ఇంట్లో బంధించేస్తుంది. ఇక అక్కడి నుంచి వారు బయటపడేందుకు మార్గం కూడా కనిపించదు. వారు అలా ఇంటి లోపల బాధపడుతూ ఉంటే.. బయట వారి బాధలను కూడా లైవ్ టెలీకాస్ట్ చేస్తుంటారు. ఇక చివరకు ఏమైందనేట్టుగా ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారు. డిస్నీ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 12న రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











