కాజల్ అగర్వాల్ పెళ్లి ఫిక్స్.. సినిమా కెరీర్ పై కూడా క్లారిటీ ఇచ్చేసిన చందమామ

ఫైనల్ గా 2020లో మరో సెలబ్రెటీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ భర్తకు సంబంధించిన వివరాలతో పాటు పెళ్లి డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేసింది. గత కొంత కాలంగా కాజల్ ఒక బిజినెస్ మెన్ తో డేటింగ్ చేస్తున్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ గా అదే నిజమైంది. కాజల్ అఫీషియల్ గా వివరణ కూడా ఇచ్చేసింది.

Recommended Video

Kajal Aggarwal Weds Gautam Kitchlu On Oct 30th In Mumbai | హార్ట్ ఐపోతున్నా కాజు ఫాన్స్
పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చిన కాజల్

పెళ్లి తేదీపై క్లారిటీ ఇచ్చిన కాజల్

ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. అక్టోబర్ 20న డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ముంబైలోనే అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్నగా వివాహా వేడుకను జరుపుకోబోతున్నాం. ఈ పాండమిక్ సమయంలో వీలైనంత వరకు జాగ్రత్తగా మా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం.

చాలా ఆనందంగా ఉంది.

చాలా ఆనందంగా ఉంది.

ఇక మేము కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఎంతగానో థ్రిల్ ఇస్తోంది. స్పూర్తితో ఇద్దరం ఒక్కటి కాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నాపై ఎంతగానో ప్రేమను చూపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమయంలో మీ బ్లెస్సింగ్స్ కావాలి.. అంటూ కాజల్ వివరణ ఇచ్చింది.

తప్పకుండా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తాను

తప్పకుండా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తాను

అలాగే నేను ఏదైతే చేయాలని అనుకుంటున్నానో అదే కంటిన్యూ చేస్తాను అంటూ.. కాజల్ సినిమా కెరీర్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది. తప్పకుండా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తాను అని మరొక విధంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వరుడి వివరాలివే..

వరుడి వివరాలివే..

లాక్ డౌన్ ముగిసిన తర్వాత ముంబైలో కాజల్ నివాసం దగ్గర ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వాళ్ల పెళ్లి జరగనుందని ముందే ఒక న్యూస్ బయటకు వచ్చింది. వరుడి ప్రోఫైల్ కూడా నెట్టింట్లో వైరల్ అియంది. కాజల్‌ది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అని, గౌతమ్ కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ లో చదువుకున్నాడని, డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అని ఓ చిట్టా కూడా వైరల్ అయ్యింది.

కాజల్ పోస్ట్ వైరల్..

కాజల్ పోస్ట్ వైరల్..

ఓ వైపు పెళ్లి వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతుంటే.. నిన్న సాయంత్రం తీరిగ్గా కాజల్ ఓ పోస్ట్ చేసింది. ఏమీ చెప్పకుండా ఏమీ రాయకుండా కేవలం లవ్ సింబల్‌ను పోస్ట్ చేసింది. దీంతో అందరి గుండె బద్దలైనంత పనైంది. కామెంట్లలో అభిమానులు విలావిలా కొట్టుకుంటున్నారు. కొందరైతే ఏకంగా కన్నీరు కూడా పెట్టుకుంటున్నారు.

రకరకాలు కామెంట్లు..

రకరకాలు కామెంట్లు..

పెళ్లి చేసుకోబోతోన్నావట కదా కాజల్ కంగ్రాట్స్ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే. వద్దు డోంట్ మ్యారీ మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లకు అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక కామెంట్ సెక్షన్ ఎక్కువ సంఖ్యలో తెలుగు అభిమానులు మాత్రమే స్పందిస్తుండటంతో టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ ఏపాటిదో అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X