పెళ్లి విషయంలో మనసు మార్చుకున్న కాజల్.. హనీమూన్ తరువాతే..

టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి న్యూస్ తో కుర్రాళ్ళ గుండెల్లో ఒక్కసారిగా అణుబాంబు వేసింది. మొత్తానికి కాబోయే వాడిని కొన్నేళ్ల క్రితమే సెట్ చేసుకున్న అమ్మడు ఇన్నేళ్లు సింగిల్ గానే ఉన్నాను అంటూ గతంలో చాలా సార్లు అబద్ధాలు చెప్పేసింది. ఏదేమైనా కాజల్ తన పర్సనల్ లైఫ్ లో ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకుందనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ బ్యూటీ పెళ్లి విషయంలో ఒక ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.

Recommended Video

Kajal Aggarwal's Fiency Gautam Kitchlu's Net Worth Details
 అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో

అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో

గత రెండేళ్ల నుంచి వస్తున్న మ్యారేజ్ రూమర్స్ కి ఎట్టకేలకు కాజల్ ఎండ్ కార్డ్ పెట్టిన విషయం తెలిసిందే. గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అక్టోబర్ 30న డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని ముంబైలోనే అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా చిన్నగా వివాహా వేడుకను జరుపుకోబోతున్నామని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.

ఇంటివద్దనే పెళ్లి..

ఇంటివద్దనే పెళ్లి..

ఇక ఈ పాండమిక్ సమయంలో వీలైనంత వరకు జాగ్రత్తగా మా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పిన ఈ బ్యూటీ మొన్నటివరకు ముంబైలోని ఒక ఫేమస్ హోటల్ లో పెళ్లి చేసుకోవలని అనుకుంది. కానీ ఇప్పుడు ముంబైలోని తన ఇంటివద్దనే పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ముంబైలో కొన్ని హోటల్స్ లలో పెళ్లిళ్లలోనే వందలాది కరోనా పాజిటివ్ కేసులు క్రియేట్ అవుతున్నాయని న్యూస్ వచ్చింది. అందుకే కాజల్ మైండ్ మారిందట.

రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక..

రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక..

ప్రస్తుతం ముంబై నగరంలో డెత్ కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ పాజిటివ్ కేసులు మాత్రం లక్షల్లో ఉన్నాయి. అయితే 50ఏళ్ల పైబడిన పెద్దవాళ్లకు మాత్రం ఇది ప్రమాధకరమనే చెప్పాలి. అయితే కాజల్ కూడా తన ఇంట్లో కుటుంబ సభ్యులను రిస్క్ లో పెట్టడం ఇష్టం లేక ఇంటి వద్దనే పెళ్లి చేసుకోవాలని రెడీ అయ్యింది. ఇప్పటికే తన కుటుంబ సభ్యులలో కొంతమందిని ఇంట్లో ఉంచుకున్న కాజల్ పెళ్లి అయ్యే వరకు ఎవరిని బయటకు పంపడానికి ఇష్ట పడటం లేదట

హనీమూన్ ఎప్పుడంటే..

హనీమూన్ ఎప్పుడంటే..

ఇక అక్టోబర్ 20న పెళ్లి అనంతరం కుదిరితే ఒక వారం తరువాత రిసెప్షన్ పార్టీని గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ అది కూడా క్యాన్సిల్ చేసినట్లు టాక్. ఇక హనీమూన్ ని నవంబర్ ఫస్ట్ వీక్ లో ప్లాన్ చెసుకున్నట్లు తెలుస్తోంది. హనీమూన్ తరువాత పరిస్థితులను బట్టి కాజల్ సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ కి గ్రాండ్ గా మ్యారేజ్ పార్టీ ఇవ్వాలని అనుకుంటోందట. ముందుగా మ్యారేజ్, హనీమూన్ ని సింపుల్ గా ఫినిష్ చేసి ఆ తరువాత పార్టీల గురించి ఆలోచించనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X