నిషా అగర్వాల్ కుమారుడి రచ్చ.. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే.. అదంతా కాజల్ ట్రైనింగేనా?

చందమామ లాంటి అందం కాజల్ అగర్వాల్ సొంతం. ఆ అక్కకు తగ్గ చెల్లి నిషా అగర్వాల్. అయితే సినీ కెరీర్ పరంగా అక్క అంతా లక్కు మాత్రం నిషాకు లేకపోయింది. కాజల్ చెల్లెలుగా నిషా అగర్వాల్ తెలుగు తెరకు పరిచయమైంది. అయితే కాజల్ రూపురేఖలు, పోలికలు నిషాలో ఉండటం కూడా ఓ మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏమైంది ఈవేళ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నిషా ఎక్కించింది. ఆపై ఎక్కువ కాలం కొనసాగక.. పెళ్లి చేసుకుని సెటిలైంది.

 కలిసిరాని చిత్రాలు..

కలిసిరాని చిత్రాలు..

నిషా అగర్వాల్ మరీ ఎక్కువ చిత్రాలు చేయలేదు. అయితే చేసిన కొన్ని చిత్రాల ద్వారానే ఆమె గుర్తింపును తెచ్చుకుంది. సోలో, సుకుమారుడు వంటి మంచి చిత్రాలు నిషా ఖాతాలో ఉన్నాయి. ఏమైంది ఈవేళ రీమేక్‌తో తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. మళయాలంలోనూ రెండు మూడు చిత్రాల్లో నటించింది.

 పెళ్లితో లైఫ్ టర్న్..

పెళ్లితో లైఫ్ టర్న్..

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే నిషా ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. 2013లో కరణ్ వాలేచాను నిషా వివాహామాడి జీవితాన్ని అలా గడిపేస్తోంది. ఈ జంటకు 2018లో ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇషాన్ వాలేచా రాకతో నిషా జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. అయితే ఇషాన్ రాకతో కాజల్‌కు పెద్దమ్మగా ప్రమోషన్ వచ్చింది.

బుడ్డోడితో ఆటలు..

బుడ్డోడితో ఆటలు..

కాజల్ ఇషాన్‌తో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. పెద్దమ్మగా కాజల్ తన బాధ్యతలను నెరవేరుస్తుంటుంది. అసలే కాజల్‌కు చిన్న పిల్లలు అంటే ఎంతో ఇష్టమట. ఇక చెల్లి కుమారుడిని ఎంత అపురూపంగా చూసుకుంటుందో చెప్పనక్కర్లేదు. చాలా రోజుల తరువాత మళ్లీ ఇషాన్‌ను కాజల్ కలుసుకున్నట్టుంది.

Recommended Video

Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
 పియానో వాయించేస్తున్నాడు..

పియానో వాయించేస్తున్నాడు..

తాజాగా ఇషాన్ అల్లరి చేష్టలను కాజల్ బయటపెట్టింది. పియానోపై ఆడుకుంటూ ఉంటే కాజల్ ఓ ఫోటో తీసింది. పెద్ద ఫ్రొఫెషనల్ పియానిస్ట్ అయినట్టు ఆ బుడ్డోడు కూడా దాన్ని ప్లే చేసినట్టు బిల్డప్ ఇస్తోంటే కాజల్ అలా కెమెరాలో పట్టేసింది. మాస్టర్ పియానిస్ట్.. అంటూ కాజల్ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే.. పెద్దయ్యాక పియానో వాయించి ఎవరినైనా ప్రేమలో పడేస్తాడో మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X