చిరంజీవితో అనుభవం అలాంటిది.. సమంత, తమన్నా అంటూ సీక్రెట్స్ చెప్పిన కాజల్

సౌత్ ఇండియన్ తెరపై మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించింది. తన పాత్ర ఎలాంటిదైనా దానికి పూర్తిగా న్యాయం చేయడంలో కాజల్ సఫలమవుతుందని చెప్పుకోవచ్చు. అందుకే దశాబ్ద కాలానికి పైగా ఈ హీరోయిన్ వెండితెర హవా సాగుతోంది. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

 పన్నెండేళ్ల సినీ జర్నీ.. బిజీ కారణంగా

పన్నెండేళ్ల సినీ జర్నీ.. బిజీ కారణంగా

తన పన్నెండేళ్ల సినీ జర్నీ గురించి స్పందించిన ఆమె.. సినిమా వాళ్లకు నిరంతరం బిజీగా ఉండటం కారణంగా రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా అర్థం కావని చెప్పింది. సినిమాలతో తన అనుబంధం ఎంతో అందమైందని ఆమె చెప్పింది.

కొత్త వ్యక్తులు.. సరికొత్త అనుభవాలు

కొత్త వ్యక్తులు.. సరికొత్త అనుభవాలు

తన సినీ ప్రయాణంలో ఎందరో కొత్త వ్యక్తులను కలిశానని కాజల్ చెప్పింది. ఈ లాంగ్ జర్నీలో కొత్త కొత్త అనుభవాలు లభించాయని, ఇంకా లభిస్తున్నాయని చెప్పుకొచ్చింది. కెరీర్ పరంగా ఎన్నో నేర్చుకున్నానని, ఇంకా నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయని ఆమె అంటోంది.

పెద్ద హీరో, చిన్న హీరో అని చూడకుండా

పెద్ద హీరో, చిన్న హీరో అని చూడకుండా

సినిమా ఎలాంటిదైనా పాత్ర నచ్చితే తాను నటించడానికి సిద్దపడతానని అంటోంది కాజల్. ఓ సినిమాకు కథే హీరో అని, కథ డిమాండ్స్ చేస్తే.. పెద్ద హీరో, చిన్న హీరో అని చూడకుండా ఎవ్వరితో అయినా నటిస్తానని ఆమె తెలిపింది. కాజల్‌ మంచి నటి అనే ఇమేజ్ సొంతం చేసుకోవడమే తప్పితే.. తాను ఇంకేదీ ఆశిచడం లేదని కాజల్ పేర్కొంది.

సమంత, తమన్నా లాంటి వారు

సమంత, తమన్నా లాంటి వారు

చిరంజీవి లాంటి హీరోలతో నటించేటప్పుడు వారి అనుభవంతో చాలా నేర్చుకోవచ్చని చెప్పింది కాజల్. తాను ఇండస్ట్రీలో హీరోలందరితోనూ సన్నిహితంగా ఉంటానని చెప్పిన కాజల్.. తనకు ఇండస్ట్రీలో సమంత, నయనతార, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ మంచి మిత్రులు అని చెప్పుకొచ్చింది.

సినిమా వాళ్ళతో పార్టీలు

సినిమా వాళ్ళతో పార్టీలు

ఇంత సినీ జర్నీలో తన గురించి ఇంత వరకూ వదంతులు రాకపోవడంపై కాజల్‌ అగర్వాల్‌ స్పందిస్తూ.. తాను షూటింగ్‌ ముగియగానే నేరుగా రూమ్‌కు వెళ్లి భోజనం చేసి పడుకుంటానని, ఫ్రెండ్స్‌ చాలా తక్కువే అని చెప్పింది. సినిమాకు చెందిన వారితో డిన్నర్, పార్టీలకు అస్సలు వెళ్లనని, ఒకవేళ పార్టీలకు వెళ్లాల్సి వస్తే స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్ తోనే అని కాజల్ చెప్పింది.

పెళ్లి చేసుకుంటే..

పెళ్లి చేసుకుంటే..

ఇక తన పెళ్లి గురించి కూడా మాట్లాడిన కాజల్.. పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగేలా ఇప్పటి వరకూ ఎవరినీ కలుసుకోలేదని చెప్పింది. నా అభిప్రాయాలకు తగిన వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది.

 కమల్ సరసన కాజల్

కమల్ సరసన కాజల్

ఇటీవలే జయం రవి సరసన 'కోమాలి', శర్వానంద్ సరసన 'రణరంగం' సినిమాల్లో నటించింది కాజల్. ఇప్పుడు కమల్ హాసన్ సరసన 'భారతీయుడు 2' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది కాజల్ అగర్వాల్. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X