For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kamal Haasan Birthday: లోక నాయకుడి నట విశ్వరూపం.. కమల్ హాసన్ సక్సెస్ మంత్రం ఇదే!

  |

  కమల్ హాసన్ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపిన ఆయన లోక నాయకుడు అయ్యారు. నేటి తరం నటీనటులుకు ఆయన ఒక సిలబస్. ప్రయోగాత్మక పాత్రలు, చిత్రాలకు నాయకుడు. తన నట విశ్వరూపంతో ప్రపంచాన్నే అబ్బురపరిచిన యూనివర్శల్ హీరో. సినిమాల్లో సంపాదించింది సినిమాలకే పెట్టిన సినీ ప్రేమికుడు. దర్శకుడిగా హిట్లు కొట్టాడు, ప్లాప్ లు రుచి చూశారు. ఓసారి లాభ పడ్డారు. మరొసారి నష్టాలు ఎదుర్కొన్నారు. కానీ ఏనాడు సినిమాను ఆపలేదు. హీరోగా మాత్రం వెనుతిరగలేదు. ఎప్పటికప్పడు క్రియేటివిటీగా ఆలోచిస్తూ, కొత్తదనంతో వచ్చే దర్శకులను నిత్యం ఎంకరేజ్ చేసే సిసలైన భారతీయుడు ఈ కమలనాథుడు. నేడు కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్న స్పెషల్ స్టోరి.

  బాల నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ..

  బాల నటుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ..

  పురాణాల్లో దశావతారాలతో లోకాన్ని ఏలింది ఆ కమల నాథుడు అయితే.. చిత్ర పరిశ్రమలో దశావతారలతో నట విశ్వరూపం చూపించిన లోకనాయకుడు ఈ కమల్ హాసన్. యుక్త వయసులో ఇంట్లో నుంచి గెంటేస్తే బార్బర్ షాపులో పనిచేసి.. గ్రూప్ డ్యాన్సర్ గా అవస్థలు పడి.. బాల నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టారు కమల్ హాసన్. నటన నేర్చుకోవాడనికి ప్రముఖ డైరెక్టర్ కె. బాలచందర్ చేతిలో చెంపదెబ్బలు తిని.. వాటిని సహించి.. జీవితంలో విజేతగా, లోక నాయకుడిగా నిలిచారు కమల్ హాసన్. సినీరంగంలో ఆయన ఎన్నో ఎత్తు పల్లాలు చూశారు. ఎంతో ఇష్టంతో ప్రాణం పెట్టి తీసిన సినిమాల్లో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఓటమిని చూశాయి.

  రిపీట్ అవుతోన్న ఒకే ఒక్క డైలాగ్..

  రిపీట్ అవుతోన్న ఒకే ఒక్క డైలాగ్..

  అయినా సరే ఏనాడు తన సినీ ప్రయణాన్ని ఆపలేదు. 67 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని నటనతో, ఆసక్తితో కొత్త తరహా కథలను ప్రోత్సహిస్తూ హిట్ అందుకుంటున్నారు కమల్ హాసన్. అలాంటి కమల్ హాసన్ కొన్ని హిట్ సినిమాల్లో ఒకే ఒక్క డైలాగ్ రిపీట్ అవుతూ వస్తోంది. ఆ డైలాగ్ ఉన్న సినిమా కమల్ హాసన్ ను మరో లెవెల్ కు తీసుకెళ్తుంది. కమల్ హాసన్ సినీ కెరీర్ లో చూసుకుంటే అలాంటివి మూడు సినిమాలు, ఒకే ఒక్క డైలాగ్ ఉంది. డైలాగ్ ఒకటే కానీ, సినిమాలు, సందర్భాలు మాత్రం వేరు. ఆ డైలాగే ''మంచివారా..? చెడ్డవారా..?''. కమల్ హాసన్ నటించి హిట్ కొట్టిన మూడు సినిమాల్లో ఈ డైలాగ్ రిపీట్ అవుతోంది. అందులో కమల్ హాసన్ పాత్రను మిగతా పాత్రలు క్వశ్చన్ చేసే డైలాగ్ ఇది.

  1987లో వచ్చిన నాయకన్ చిత్రంలో..

  1987లో వచ్చిన నాయకన్ చిత్రంలో..


  కమల్ హాసన్ సినీ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన చిత్రం నాయగన్. తెలుగులో నాయకుడుగా విడుదల చేశారు. 1987 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా తమిళంలో తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం హాలీవుడ్ హిట్ మూవీ గాడ్ ఫాదర్ ను స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం నాయకుడు. ఇందులో కొడుకు చనిపోయినప్పుడు బాధపడే తండ్రిగా చేసిన కమల్ హాసన్ నటన.. కాదు జీవించారని చెప్పాలి. ప్రతి అంశంలో పేరు ప్రఖ్యాతలు సాధించింది. ఆ సినిమాలో ఒక చిన్న బాబు కమల్ హసన్ ను పట్టుకుని మీరు ''మంచివారా..? చెడ్డవారా..?'' అని అడుగుతాడు. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అప్పుడు కమల్ హాసన్ కన్నీళ్లతో తెలియదు అని సమాధానం ఇస్తాడు.

  గూస్ బంప్స్ తెప్పించిన సీన్..

  గూస్ బంప్స్ తెప్పించిన సీన్..

  కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి, నట విశ్వరూపం చూపించిన చిత్రం 'విశ్వరూపం 1'. ఇందులో ఓ డ్యాన్స్ మాస్టర్ గా, భర్త విశ్వనాథన్ గా, ఐసిస్ కి ట్రెనింగ్ ఇచ్చే శిక్షాణాధికారి విసామ్ అహ్మద్ కాశ్మీరిగా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తారు. కానీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి భారత్ ను కాపాడే ఓ ఏజెంట్ గా పవర్ ఫుల్ రోల్ లో నటించారు. ఇందులో అమాయకపు భర్తగా నటించి ఇంటర్వెల్ సీన్ లో అసలు క్యారెక్టర్ లోకి కమల్ హాసన్ వచ్చే సీన్ థియేటర్లలో ఎంతోమందికి గూస్ బంప్స్ తెచ్చింది. ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, క్యారెక్టర్ ఎలివేషన్, కమల్ హాసన్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సీన్ తర్వాత టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి బయట పడిన కమల్ హాసన్ టీమ్ ఓ హోటల్ రూమ్ లో స్టే చేస్తుంది.

  ఆ సినిమాలోని పాత్రకు కొనసాగింపుగా..

  ఆ సినిమాలోని పాత్రకు కొనసాగింపుగా..

  భర్తపై అనుమానంతో డిటెక్టివ్ ను పెట్టిన డాక్టర్ నిరుపమ.. కమల్ హాసన్ ఒరిజినాలిటీ చూసి షాక్ అవుతుంది. అప్పుడు వాళ్లు చేస్తుంది అర్థం కాక.. మీరు ''మంచివారా..? చెడ్డవారా..?'' అని అడుగుతుంది. అక్కడ నేనే విలన్.. నేనే హీరో అని కార్డ్స్ పైకి విసిరేసి కొన్ని సీన్లు చూపిస్తారు. ఈ సినిమా కూడా కమల్ కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా. ఇక ఈ సినిమా విడుదల చేయొద్దని ఎన్నో విమర్శలు తలెత్తాయి. విడుదలైన కొన్ని చోట్ల థియేటర్లలను కాల్చివేశారు కూడా. ఇక ఫైనల్ గా చెప్పుకునేది మూడో సినిమా విక్రమ్. చాలా కాలంగా సరైన హిట్ లేకుండా ఉన్న కమల్ హాసన్ కు మాసీవ్ కమ్ బ్యాక్ హిట్ ఇచ్చిన చిత్రం విక్రమ్. 1986లో విడుదలైన ఏజెంట్ విక్రమ్ 007 సినిమాలోని విక్రమ్ పాత్రకు కొనసాగింపుగా రూపొందిన చిత్రమే ''విక్రమ్: ది హిట్ లిస్ట్''.

   మంచివారా..? చెడ్డవారా..?

  మంచివారా..? చెడ్డవారా..?

  విక్రమ్ 2 సినిమాలో తన కొడుకును సంతానం గ్యాంగ్ చంపేశాక తను చనిపోయినట్లుగా నమ్మించి ఒక్కొక్కరిని వేటాడుతుంటాడు కర్ణన్ అలియాస్ విక్రమ్. ఈ క్రమంలోనే విక్రమ్ ఎవరో తెలిసినా సంతానం గ్యాంగ్ కమల్ హాసన్ మనవడి కోసం ఇంటికి వెళ్తుంది. అక్కడ ఏజెంట్ టీనా చేసిన పోరాటం ఎవరు మర్చిపోలేరు. ఆమె చనిపోయాక వచ్చిన విక్రమ్ బాబుని తీసుకుని వెళ్తానని, ఎయిర్ పోర్టులో మళ్లీ అప్పజెప్తానని ఆయన కోడలుకు చెబుతాడు. అప్పుడే ఆమె అతన్ని అడుగుతుంది ఇంతకి మీరు ఎవరు.. ''మంచివారా..? చెడ్డవారా..?'' అని. దానికి కమల్ హాసన్.. ఈ ప్రశ్నకు సమాధానం నేను చెప్పను. ఆమె కొడుకును చూపిస్తూ వీడు పెద్దయ్యాకా చెబుతాడు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  హిట్టు మంత్రంలా..

  ఇలా ఈ మూడు సినిమాలు ఆయన కెరీర్ స్ట్రగుల్ లో ఉన్నప్పుడే హిట్ ఇచ్చాయి. ప్రస్తుతం కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూడు సినిమాల్లోని ఈ డైలాగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా చూస్తుంటే ''మంచివారా..? చెడ్డవారా..?'' అనే డైలాగ్ కమల్ హాసన్ కు హిట్టు మంత్రంలా పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది.

  English summary
  Kamal Haasan Movies Nayagan Vishwaroopam Vikram Popular One Dialogue Goes Viral In Social Media On His Birthday
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X