2020లో వివాదాలు.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. ఆ హీరోయిన్లు మామూలోళ్లు కాదు!!

కరోనా వైరస్ ఎంతగా ఫేమస్ అయిందో.. కొందరు హీరోయిన్లు మాత్రం అంతకు మించి ఫేమస్ అయ్యారు. అందులో ముఖ్యంగా కంగనా రనౌత్, రియా చక్రవర్తి, తాప్సీ, స్వర భాస్కర్, పాయల్ ఘోష్ వంటివారు సోషల్ మీడియాను ఊపేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఈ అందరూ కూడా బాగానే వైరల్ అయ్యారు. కంగనా రనౌత్ పుట్టించిన మంటలు, చేసిన ఆరోపణలు, మాట్లాడిన మాటలు ఎక్కడికో వెళ్లాయి. చివరకుు శివసేన ప్రభుత్వానికి కంగనాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం మారింది.

సుశాంత్ సింగ్ కేసులో..

సుశాంత్ సింగ్ కేసులో..


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో కంగనా రనౌత్ చేసిన కామెంట్లు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. నెపోటిజం, బాలీవుడ్ మూవీ మాఫియా, కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా వంటి వారి వల్లే సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడని కంగనా ఆరోపించింది. ఆ మధ్య కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా, సల్మాన్ ఖాన్ వంటివారు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు.

కంగనా హాట్ టాపిక్..

కంగనా హాట్ టాపిక్..

సోషల్ మీడియా, మీడియాలో ఓ రెండు మూడు నెలలు కంగనాయే కనిపించింది. 24 గంటలు టీవీల్లో డిబెట్లు నిర్వహించడం.. అందులో కంగనా రనౌత్ బాలీవుడ్ మీద, వారసత్వపు హీరో, హీరోయిన్ల మీద ఆరోపణలు చేయడం, ఆ తరువాత డ్రగ్స్ కేసులో కంగనా చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేశాయి.

తాప్సీ, స్వర భాస్కర్ అలా..

తాప్సీ, స్వర భాస్కర్ అలా..

బీ గ్రేడ్ నటిమణులు అంటూ కంగనా రనౌత్ తాప్సీ, స్వర భాస్కర్‌లపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మంట పుట్టించాయి. ఇక తాప్సీ, స్వర భాస్కర్‌లు కంగనాకు అంతే స్థాయిలో కౌంటర్లు వేశారు. అలా ఈ ముగ్గురి మధ్య ఎప్పుడూ మాటల యుద్దం జరుగుతూనే వచ్చింది.

రియా చక్రవర్తి వైరల్..

రియా చక్రవర్తి వైరల్..


సుశాంత్ సింగ్ మరణంతో రియా చక్రవర్తి బాగా పాపులర్ అయింది. సుశాంత్ సింగ్‌ది హత్య అని, అందులో రియా చక్రవర్తి, మహేష్ భట్, సల్మాన్ ఖాన్ సన్నిహితులున్నారని, దిశ సలియాన్ మరణంతో లింక్ ఉందంటూ వచ్చిన వార్తలు, డ్రగ్స్ కేసులో రియా అరెస్ట్ కావడం ఇలా ప్రతీ ఒక్క అంశంతో ఈ ఏడాది హాట్ టాపిక్ అయింది.

Recommended Video

Ganesh Chaturthi 2019 : Vivek Oberoi & Family Celebrate Ganpati Visarjan
పాయల్ ఘోష్ అలా..

పాయల్ ఘోష్ అలా..

ప్రయాణం, ఊసరవెల్లి ఫేమ్ పాయల్ ఘోష్ ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశాడంటూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. పాయల్ ఘోష్ తన డిప్రెషన్‌కు కారణాలు, సుశాంత్ సింగ్ కేసులో పురోగతి లేకపోవడం, ఎన్టీఆర్‌పై కొందరు చేసిన ఆరోపణలు ఖండించడం వంటివి చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X