రెండో పెళ్లికి సిద్దమైన కనికా థిల్లాన్.. పిక్స్ వైరల్
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి గురించి అందరికీ తెలిసిందే. అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో వంటి చిత్రాలకు దర్శకుడిగా పనిచేశాడు. సైజ్ జీరో చిత్రానికి ప్రకాష్ కోవెలమూడితో పాటు కనికా థిల్లాన్ కూడా పనిచేసింది. ఆ సమయంలో వారిద్దరూ భార్యాభర్తలుగానే ఉన్నారు. కానీ వారిద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు. అలా విడిపోయిన కనికా తాజాగా రెండో పెళ్లికి సిద్దమైంది.
బాలీవుడ్‌లో అనేక సినిమాలకు రైటర్‌గా పనిచేసిన కనికా ఇప్పటివరకు కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఆమె రైటింగ్, స్టోరీలు మాత్రం అందరినీ ఆలోచించేలా ఉంటాయి. అలా ఈమె మెంటల్ హై క్యా, కేదార్‌నాథ్ వంటి చిత్రాలకు కథలను అందించింది. అలాంటి కనికా కొన్ని రోజులుగా రచయిత హిమాన్ష్ శర్మతో డేటింగ్ చేస్తోంది. హిమాన్షు కూడా గతంలో స్వర భాస్కర్‌తో రిలేషన్ షిప్‌లో ఉండేవాడు. కానీ గత ఏడాది కాలం నుంచి హిమాన్షు, కనికాలు రిలేషన్ షిప్‌లోఉన్నారు.

తాజాగా వాటిపై నోరు విప్పారు. ఇన్నాళ్ల మా బంధాన్ని పెళ్లితో ముందుకు తీసుకెళ్లుందుకు సిద్దమయ్యాయమని చెప్పారు. ఈ క్రమంలోనే తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. హిమాన్షు కూడా పాపులర్ రైటర్. తను వెడ్స్ మను వంటి సూపర్ హిట్ చిత్రాలకు పనిచేశాడు. మొత్తానికి ఈ ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో బాగానే వైరల్అవుతున్నాయి.



Click it and Unblock the Notifications











