Rishab Shetty: అభిమానిని పెళ్లాడిన కాంతార హీరో.. రిషబ్ శెట్టి ఫేస్ బుక్ లవ్ స్టోరీ ఇదే..

రిషబ్ శెట్టి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. కాంతార సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమా మొదటగా కన్నడ నాట విడుదలై వారం రోజుల్లోనే దేశం మొత్తం చర్చించుకునేలా చేసింది ఈ మూవీ. ముఖ్యంగా ఈ సినిమా టేకింగ్, డైరెక్షన్, యాక్షన్, మ్యూజిక్, కథ ఇలా ఒక్కటేంటి.. ప్రతి అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకునేందుకు ప్రధాన కారణం రిషబ్ శెట్టినే. దీంతో రిషబ్ శెట్టి నేపథ్యం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన వివాహం, లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ వివరాళ్లోకి వెళితే..

 ఆసక్తిరంగా లవ్ స్టోరీ..

ఆసక్తిరంగా లవ్ స్టోరీ..


చిన్న మూవీగా విడుదలైన కాంతార దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడలో ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 200కు పైగా కొల్లగొట్టింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కేవలం 13 రోజుల్లేనే రూ. 45 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడంతో కాంతార హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈ క్రమంలో ఆయన లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది.

 రక్షిత్ శెట్టి వీరాభిమాని..

రక్షిత్ శెట్టి వీరాభిమాని..

రిషబ్ శెట్టిది లవ్ మ్యారేజ్. రిషబ్ శెట్టి 2016లో కిరిక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా చేసింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షిత్ శెట్టి వీరాభిమాని ప్రగతి కూడా వెళ్లింది. అక్కడే మొదటిసారి ప్రగతిని చూశాడు రిషబ్ శెట్టి. అయితే ఆమెను ఎక్కడో చూసినట్లు ఉందే అని అనుకున్నాడట రిషబ్.

ఎక్కడో చూసినట్టు ఉందే..

ఎక్కడో చూసినట్టు ఉందే..

ప్రగతిని ఎక్కడో చూసినట్టు ఉందని అనుకుంటూ వెళ్లిన రిషబ్ శెట్టి.. ఆమె గురించే ఆలోచిస్తూ ఫేస్ బుక్ ఓపెన్ చేశాడట. అందులో అప్పటికే ప్రగతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఉంది. దాదాపు సంవత్సరం క్రితం రిషబ్ శెట్టికి ప్రగతి ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందట. కానీ అప్పుడు రిషబ్ అంతగా పట్టించుకోలేదట. కిరిక్ పార్టీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూశాక ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడట రిషబ్.

రిషబ్ శెట్టితో పెళ్లికి నిరాకరణ..

రిషబ్ శెట్టితో పెళ్లికి నిరాకరణ..

అప్పటి నుంచి రిషబ్, ప్రగతి మధ్య చాటింగ్, ఫోన్ కాల్స్ ప్రారంభమయ్యాయి. వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్, తర్వాత ప్రేమ చిగురించి చివరికి పెళ్లి దాకా వెళ్లిపోయింది. అయితే రిషబ్ శెట్టితో ప్రగతి వివాహాన్ని ఆమె ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. రిషబ్ ది సినిమా బ్యాక్ గ్రౌండ్ కావడం, పెద్దగా సెటిల్డ్ కాలేదనే ఉద్దేశంతో పెళ్లికి నిరాకరించారట. కానీ పట్టుబట్టిన ప్రగతి.. వాళ్ల ఇంట్లో ఒప్పించిదట.

ఫేస్ బుక్ ద్వారా అప్రోచ్ అయి..

ఫేస్ బుక్ ద్వారా అప్రోచ్ అయి..


2017లో రిషబ్ శెట్టిని వివాహం చేసుకున్న ప్రగతి కాస్తా ప్రగతి శెట్టిగా మారింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రక్షిత్ శెట్టి వీరాభిమాని అయిన ప్రగతి.. రిషబ్ శెట్టిని ఫేస్ బుక్ ద్వారా అప్రోచ్ అయి.. ఇంట్లో వాళ్లను ఒప్పించి మరి వివాహం చేసుకుంది. ఇటీవల రిషబ్ శెట్టి నటించిన సినిమాలో ఆయన భార్య ప్రగతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X