బ్రేకింగ్: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్.. 50 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రిగా సైఫ్
ప్రముఖ బాలీవుడ్ తారలు కరీనా కపూర్, సైఫ్ ఆలీఖాన్ దంపతులు రెండో బిడ్డకు జన్మినిచ్చారు. ఆదివారం ఉదయం కరీనా మగబిడ్డకు జన్మినిచ్చినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ శుభ సమయంలో కరీనా, సైఫ్ దంపతులకు అభిమానుల, సినీ ప్రముఖులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

2012లో ప్రేమ వివాహం
2012లో ప్రేమ వివాహం
కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ కొద్ది సంవత్సరాలు ప్రేమలో మునిగి తేలిన తర్వాత వారిద్దరూ 2012లో వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత వారికి తైమూర్ ఆలీ ఖాన్ రూపంలో డిసెంబర్ 2016లో తొలి సంతానం కలిగింది. తాజాగా ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 4.45 గంటలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో కరీనా కపూర్ ప్రసవించారు.

సైఫ్ ఆలీ ఖాన్‌కు అమృతా సింగ్‌తో
కరీనా కపూర్‌ను వివాహం చేసుకోక ముందు గతంలో అమృతా సింగ్‌తో సైఫ్ పెళ్లి జరిగింది. వారిద్దరికి సారా ఆలీ ఖాన్, ఇబ్రహీం ఆలీ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు రావడంతో విడిపోయారు. అనంతరం కరీనాకపూర్‌ను వివాహం చేసుకొన్నారు. సైఫ్ కుమార్తె సారా ఆలీ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.

50 ఏళ్ల వయసులో నాలుగో సంతానం
ఇక 50 ఏళ్ల వయసులో సైఫ్ ఆలీ ఖాన్‌కు నాలుగో సంతానం కలిగింది. కరీనా కపూర్, సైఫ్‌కు ఇది రెండో సంతానం. ఇటీవల ఇంటర్యూలో సైఫ్ మాట్లాడుతూ.. మరోసారి తండ్రి కాబోతుండటంతో నాలో మరింత పరిణతి కనిపిస్తున్నది. పిల్లలతో సమయాన్ని గడపటం చాలా ఆనందంగా ఉంది అని ఆయన అన్నారు.
Recommended Video

కరీనా కపూర్ కెరీర్ ఇలా
కరీనా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కరణ్ జోహర్ రూపొందించే తఖ్త్ చిత్రంలో కూడా కనిపించనున్నారు. ఇక సైఫ్ ప్రభాస్‌తో కలిసి ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











