CCL 2024 సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో సంచలనం.. ఫస్ట్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన కర్ణాటక బౌలర్

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ సీజన్ 10 లో సంచలనాలు నమోదు అయ్యాయి. ఆదివారం (మార్చి 3) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చెన్నై రైనోస్ జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్ బౌలర్లు ఆధిపత్యాన్ని కనబరిచారు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు కరణ్, కార్తీక్ చెరో మూడేసి వికెట్లు పడగొట్టడంతో చెన్నై జట్టు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక బౌలర్ హ్యాట్రిక్ సాధించడంతోపాటు.. ఈ సీజన్‌లో 10 ఓవర్లలో ఆలౌట్ అయిన జట్టుగా చెన్నై రికార్డు క్రియేట్ చేసింది. ఈ సంచనాల వివరాల్లోకి వెళితే..

కర్ణాటక బుల్డోజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై రైనోస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొన్నది. దాంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన జట్టు భారీ స్కోర్ సాధించింది. ప్రదీప్ 33 బంతుల్లో 65 పరుగులు చేయగా, క‌ృష్ణా 24 బంతుల్లో 57 పరుగులు చేశాడు. చందన్ 4 పరుగులు, కరణ్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

Karnataka Bulldozers Bowler Karan Creates History With Hat Trick In CCL 2024 against Chennai Rhinos

ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై జట్టును కర్ణాటక బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో అల్లాడించారు. బౌలర్ కార్తీక్ విజృంభించి పృథ్వి, రమణ, శంతను వికెట్లను పడగొట్టి చెన్నై టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వెన్ను విరిచారు. దాంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పండింది.

ఆ తర్వాత బౌలింగ్ చేపట్టిన కరణ్ బాల్‌తో చెన్నై బ్యాట్స్‌మెన్లను గడగడలాడించారు. 16 బంతుల్లో 19 పరుగులు చేసిన విక్రాంత్‌ను, పరుగులేమి చేయకుండానే జీవాను పెవిలియన్‌కు పంపించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఆర్యను కూడా క్లీన్ బౌల్డ్ చేసి టాప్ ఆర్డర్‌ను నేలమట్టం చేశాడు.

Karnataka Bulldozers Bowler Karan Creates History With Hat Trick In CCL 2024 against Chennai Rhinos

ఇలా చెన్నై జట్టు బ్యాట్స్‌మెన్స్ కర్ణాటక బౌలింగ్ తట్టుకోలేక విలవిలలాడారు. అయితే నిర్ణీత 10 ఓవర్లలో జట్టు 84 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుత సీజన్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిన జట్టుగా చెన్నై దారుణమైన రికార్డును సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X