భార్యతో రాజమౌళి ఫుల్ రొమాంటిక్.. జక్కన టాలెంట్ చేస్తే షాకే!
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ వివాహం జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను కార్తీకేయ పెళ్లి చేసుకోన్న విషయం విదితమే. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా రాజమౌళి దంపతులు చేసిన వీడియో ట్రెండ్ అవుతున్నది. వారిద్దరూ ఏ పాటకు డ్యాన్స్ చేశారంటే..

రాజమౌళి దంపతులు డ్యాన్స్
ఇప్పటి వరకు రాజమౌళి, రమా రాజమౌళిని కెమెరా వెనుక దర్శకుడిగా, డిజైనర్లుగానే చూశాం. అయితే కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా వారిలోని డ్యాన్స్ టాలెంట్ బయటపడింది. ఎట్టాగే ఉన్నావే ఓ లమ్మీ పాటకు రాజమౌళి దంపతులు చేసిన డ్యాన్స్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
హీరో, హీరోయిన్లకు తీసి పోని విధంగా
ఎట్టాగే ఉన్నావే ఓ లమ్మీ పాటకు రాజమౌళి, రమా రాజమౌళి రెచ్చిపోయి స్పెప్పులు వేశారు. సినిమా హీరో, హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా స్టెప్పులతో ఆలరించారు. లయబద్దంగా వేసిన స్టెప్పులకు అభిమానులు చప్పట్లు మోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నది.

గ్రాండ్‌గా హైదరాబాద్‌లో రిసెప్షన్
డిసెంబర్ 30న జైపూర్‌లో వివాహం తర్వాత సినీ, ఇతర ప్రముఖులకు రాజమౌళి హైదరాబాద్‌లో శనివారం గ్రాండ్ విందును ఏర్పాటు చేశారు. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కుమారుడి వివాహం సందర్భంగా ఇచ్చిన విందు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.

రెండో షెడ్యూల్‌లో RRR మూవీ
ఇక బాహుబలి తర్వాత రాజమౌళి RRR అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. RRR అంటే రామ రావణ రాజ్యం అని టైటిల్ గురించి చెప్పుకొంటున్నారు. మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్నారు. నవంబర్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. త్వరలోనే భారీ సెట్టింగులు వేసి రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications











