ఫ్లాష్ బ్యాక్ : ‘డార్లింగ్’ ఫస్టాఫ్ చూసి తిట్టారు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
డార్టింగ్ సినిమా ప్రభాస్‌కు ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న ప్రభాస్‌కు తన కెరీర్‌లో నిలిచిపోయే చిత్రంగా డార్లింగ్ మిగిలిపోయింది. డైరెక్టర్‌గా కరుణాకరన్‌ను కూడా మళ్లీ లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది. తొలిప్రేమ తరువాత అంతటి మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయలేకపోయిన కరుణాకరన్ డార్లింగ్ సినిమాతో అందర్నీ మెప్పించాడు. ఈ మధ్య దశాబ్దం పూర్తి చేసుకుంది.

కెరీర్‌లోనే క్లాసిక్..
ప్రభాస్ కెరీర్‌లో డార్లింగ్ చిత్రం ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ప్రేమకథ చిత్రాల్లో ప్రభాస్ అప్పటి వరకు నటించినా.. డార్లింగ్ మాత్రం మహిళా ప్రేక్షకులకు మరింత దగ్గరచేసింది. ఈ చిత్రం తరువాత అందరికీ డార్లింగ్ అయిపోయాడు. విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఏర్పడింది.

డార్లింగ్‌కు డికేడ్..
అయితే డార్లింగ్ సినిమా వచ్చి దశాబ్దం అయిన సందర్భంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. డికేడ్ ఫర్ క్లాసిక్ డార్లింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీన్ని బట్టే అర్థమవుతోంది డార్లింగ్ సినిమా ఎంతటి ప్రభావాన్ని చూపిందో.

ఆ విషయంలో రిస్క్ చేశా..
ఈ సందర్భంలో డైరెక్టర్ కరుణాకరన్ మాట్లాడిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ కథ గురించి చెబుతూ.. తానెప్పుడూ కొత్తగా స్టోరీని చెప్పాలనుకుంటున్నానని తెలిపాడు. అందుకే తన సినిమాల్లో స్క్రీన్ ప్లే భిన్నంగా ఉంటుందని తెలిపాడు. ఈ సినిమా కోసం చాలా రిస్క్ చేశానని తెలిపాడు.
Recommended Video

చాలా మంది తిట్టారు..
అయితే ఈ కథలో ఫస్టాఫ్ అబద్దమని తెలిశాక చాలా మంది తనను తిట్టారని తెలిపాడు. కానీ ప్రభాస్ కాజల్ యాక్టింగ్, కెమిస్ట్రీ, కామెడీ ఇలా అన్ని కలిసి ఫస్టాప్‌ను గట్టెక్కించాయని అన్నాడు. ఇప్పటికీ ప్రభాస్‌ను డార్లింగ్ అనే సంబోధిస్తున్నారంటేనే ఆ సినిమా ఏ రేంజ్‌లో ఆడిందో తెలిసిపోతోంది.


Click it and Unblock the Notifications











