twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో అలాంటివెన్నో జరిగాయి.. సల్మాన్ ఖాన్‌ను లాగుతూ జయా బచ్చన్‌పై కస్తూరీ సెటైర్స్

    |

    ప్రస్తుతం సుశాంత్ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ లింకులు బయటపడుతున్నాయి. బాలీవుడ్‌లో డ్రగ్స్ రాకెట్ డొంక కదిలేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రియా చక్రవర్తి అరెస్ట్ అవ్వడం విచారణలో ప్రముఖుల పేరు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ తతంగంపై రాజ్య సభలో జయా బచ్చనే నేడు ప్రసంగించింది. నిన్న లోక్ సభలో నటుడు, ఎంపీ రవికిషన్ మాట్లాడిన మాటలకు నేడు జయా బచ్చన్ కౌంటర్ ఇచ్చారు. ఇక జయా బచ్చన్ మాట్లాడిన వ్యాఖ్యలను కస్తూరీ సెటైర్ వేసింది.

    Recommended Video

    Jaya Bachchan కు కౌంటర్ ఇచ్చిన Kangana Ranaut,నా స్థానంలో మీ కూతురు ఉంటే ఇలాగే మాట్లాడతారా ?
    ఇండస్ట్రీలో డ్రగ్స్..

    ఇండస్ట్రీలో డ్రగ్స్..

    బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఉందని, ఎన్‌సీబీ అధికారులు సరైన పద్దతిలోనే విచారిస్తున్నారని ఎంపీ, నటుడు రవికిషన్ పేర్కొన్నాడు. ఎన్‌సీబీ అధికారులను అభినందిస్తున్నా అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యాయి. వీటిపై జయా బచ్చన్ కౌంటర్ వేశారు.

    కొందరి వల్ల అందరికీ

    కొందరి వల్ల అందరికీ

    ఇండస్ట్రీలో ఉండి.. ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కొందరు. తిన్నింటి వాసాలను లెక్కబెడుతున్నారంటూ జయా బచ్చన్ చురకలు అంటించారు. కొందరి వల్ల మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని దోషులుగా చూపెడుతున్నారని, సోషల్ మీడియాలో మరీ దారుణంగా ప్రచారం చేస్తున్నారని జయా బచ్చన్ చెప్పుకొచ్చింది.

    కస్తూరీ శంకర్ సెటైర్..

    కస్తూరీ శంకర్ సెటైర్..

    సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో కస్తూరీ శంకర్ ఒకరు. ఆ మధ్య వనిత విజయ్ కుమార్ వివాదంలో నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూనే వచ్చింది. ఇక మీరా మిథున్ వ్యవహారంలో కోలీవుడ్‌ను సపోర్ట్ చేస్తూ ఆమెపై సెటైర్స్ వేసింది. కోలీవుడ్, నెపోటిజం, మూవీ మాఫియా వంటి వాటిపై స్పందించింది. తాజాగా జయా బచ్చన్ వ్యాఖ్యలపై కౌంటర్ వేసింది.

    బాలీవుడ్ అంటే అది కాదు..

    బాలీవుడ్ అంటే అది కాదు..

    బాలీవుడ్ ఇండస్ట్రీనే మొత్తం ఇండియన్ మూవీ ఇండస్ట్రీగా ప్రొజెక్ట్ చేయడంపై కస్తూరీ ఫైర్ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. జయా బచ్చన్ గారు..కేవలం బాలీవుడ్ మాత్రమే భారత సినీ పరిశ్రమ కాదు.. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియా లింక్ మొత్తం సినిమా పరిశ్రమకు ఆపాదించకండి.. డ్రగ్స్ తీసుకునే వారు లూజర్స్ కాదు.. జెలసీతో తీసుకుంటున్నారు.. వారంతా ఎంతో సాధించినవారే అని చెప్పుకొచ్చింది కస్తూరి.

    జనాల మీదకు కారు ఎక్కించారు..

    జనాల మీదకు కారు ఎక్కించారు..

    నిజంగా నిజాయితీగా మాట్లాడాల్సి వస్తే.. సుశాంత్ సింగ్ మరణంపై మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నవారే శిక్షకు అర్హులు. బాలీవుడ్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన వార్తలు రావడం కొత్తేమీ కాదు.. షూటింగ్ చేస్తూ కొంతమంది పట్టుబడ్డారు.. జింకలు వేటాడుతూ కొందరు.. జనాలపై కార్లను ఎక్కించే వారుకూడా ఉన్నారు అంటూ సల్మాన్ ఖాన్‌ను మధ్యలోకి లాగింది కస్తూరి.

    English summary
    Kasthuri Shankar About Jaya Bachchan Speech In Rajya sabha, TBH the biggest slur on Film industry comes from those remain mute spectators in the SushantSinghRajput saga. Or for the exposés in the past.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X