twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొమ్మిది స్పోర్ట్స్ కార్లు, డెస్టినేషన్ వెడ్డింగ్ ఎందుకు.. విరాట్ కోహ్లీని ఏకిపారేసిన కస్తూరి

    |

    దీపావళి పండుగ వస్తే చాలు అందరికీ వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం గుర్తుకు వస్తుంది. క్రాకర్స్ కాల్చకండి వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోతుందని అందరూ సందేశాల మీద సందేశాలు ఇస్తారు. అసలు మ్యాటర్ ఏంటంటే అలాంటి వారే వాటిని ఎక్కువగా వాడుతుంటారు. సామాన్య ప్రజానీకం ఒక్క దీపావళి నాడు క్రాకర్స్ కాలిస్తే పెద్ద పెద్ద సెలెబ్రిటీలు వారి బర్త్ డేలు, పెళ్లిళ్లు అని పెద్ద మొత్తం కాల్చుతారు. కానీ అప్పుడు ఆ మెసెజ్‌లు వారికి గుర్తు రావు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి ఓ సందేశమే ఇచ్చి బొక్క బోర్లా పడ్డాడు.

    విరాట్ కోహ్లీ అలా..

    విరాట్ కోహ్లీ అలా..

    అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. క్రాకర్స్ కాల్చకండి.. దీపావళి అంటే దీపాల పండుగ అంతే అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అలా దీపావళి నాడు టపాసులు కాల్చకండని చెప్పిన కోహ్లీ కొన్ని విషయాలను మరిచిపోయాడు. వాటిని నెటిజన్లు గుర్తు చేసి విరాట్ కోహ్లీని దారుణంగా ట్రోల్ చేశారు.

    బర్త్ డే వేడుకలు..

    బర్త్ డే వేడుకలు..

    విరాట్ కోహ్లీ బర్త్ డే వేడుకలు ఐపీఎల్ సీజన్‌లో జరిగింది. దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. అప్పుడు పెద్ద మొత్తంలో టపాసులను కాల్చి హంగామా చేశారు. అప్పుడు మాత్రం కాలుష్యం గురించి గుర్తుకు రాలేదా? అని నెటిజన్లు ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు. తాజాగా కస్తూరి శంకర్ విరాట్ కోహ్లీని ఏకిపారేసింది.

    తొమ్మిది కార్లు అవసరమా?

    తొమ్మిది కార్లు అవసరమా?

    విరాట్ కోహ్లీ వీడియోపై కస్తూరీ ఫైర్ అయింది. సరే దీపావళికి క్రాకర్స్ వద్దు.. దీపాలు సరిపోతాయి.. అయితే తొమ్మిది స్పోర్ట్స్ కార్లు అవసరమా? వాయు, శబ్ద కాలుష్యం పెరగదా? ఓ బైక్ సరిపోతుంది కదా. చార్టెడ్ ఫ్లైట్స్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎందుకు.. ఎయిర్ పోర్ట్స్‌లో ఓవర్ లోడ్ అవుతుంది.. చిన్నగా లోకల్‌నే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే సరిపోదా అని చురకలు అంటించింది.

    Recommended Video

    Rowdy Baby Hits 1 Billion Views, Dhanush, Sai Pallavi Tweets
    అది జీవనోపాధి...

    అది జీవనోపాధి...

    కస్తూరి మరో ట్వీట్ చేస్తూ విరాట్ కోహ్లీ లాంటి యూత్ ఐకాన్ మాట్లాడేముందు కొన్ని ఆలోచించుకోవాలి.. దీపావళి క్రాకర్స్ తయారు చేస్తూ కొన్ని వేల మంది శివకాశిలో జీవనోపాధి కోసం శ్రమిస్తున్నారు. అది ఇండియాకు పుట్టిళ్లు వంటిది. దీపావళి అంటే వారికి అన్నం పెట్టే పండుగ. మీరు ప్రకటనలు ఇచ్చుకునే ఉత్పత్తులు కావంటూ సెటైర్లు వేసింది.

    English summary
    Kasthuri Shankar Fires On Virat Kohli About Crackers On Diwali, No crackers for Diwali, diya is enough ? Sure. Better still, Why nine sports cars? noise and air pollution. Bicycle is enough.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X