స్టార్ హీరోను తలదన్నేలా కౌశల్ క్రేజ్.. కౌశల్ ఆర్మీ 2Kర్యాలీకి దిమ్మ తిరిగే స్పందన!
Recommended Video

బిగ్‌బాస్ కంటెస్టెంట్ కౌశల్ అభిమానులు హైదరాబాద్‌లో నిర్వహించిన 2కే రన్‌కు విశేష స్పందన లభించింది. సెప్టెంబర్ 9న ఆదివారం ఉదయం 9 గంటలకు మాదాపూర్‌లో మొదలైన ఈ ర్యాలీకి భారీ స్పందన లభించింది. వేలాది మందిగా ఈ వాక్‌కు తరలివచ్చారు. సోషల్ మీడియాలో కౌశల్ అభిమానులు కౌశల్ ఆర్మీ పేరుతో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కౌశల్‌కు వచ్చిన స్పందన చూసి సినీ వర్గాలు ఆశ్చర్య పోయారు.

2k ర్యాలీకి విశేష స్పందన
కౌశల్ ఆర్మీ నిర్వహించిన 2k వాక్‌కు విశేష స్పందన లభించడం సినీ, సామాన్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్దగా క్రేజ్, పేరు లేని సినిమా యాక్టర్‌గా కౌశల్ బిగ్‌బాస్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత తనదైన గేమ్‌తో ప్రేక్షకులను, సోషల్ మీడియా సమాజాన్ని ఆకట్టుకొన్నాడు.
ఇసుక వేస్తే రాలనంతగా
కౌశల్ ఆర్మీ 2k వాక్‌కు వచ్చిన ఔత్సాహికులను చూసి ఓ రాజకీయ నాయకుడి ర్యాలీ నిర్వహించినా.. లేదా ఓ సినీ హీరో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినా స్వచ్చందంగా ఇంత మంది రారు. కానీ కౌశల్ ప్రమేయం లేకుండా, పిలుపు ఇవ్వకుండానే ఇంత మంది రావడం నిజంగా ఆయన క్రేజ్ ఏంటో స్పష్టమవుతున్నదనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తున్నది.
2k రన్ కోసం భారీగా ప్రచారం
2k రన్ కోసం సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ భారీ ప్రచారాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. టీషర్టులను ముద్రించింది. ప్రస్తుతం తాజా ఈవెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
బిగ్‌బాస్‌లో కౌశల్ స్పెషల్ షో
ఇక బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకొన్నది. ఈ గేమ్ షోలో కౌశల్ ప్రత్యేకమైన ఆట తీరును కనబరుస్తున్నాడు. దాంతో ఇంట్లో ఒంటరిపోరాటాన్ని చేస్తున్నాడు. ఇంటి సభ్యురాలు గీతా మాధురి నామినేట్ చేయడంతో మరో మూడు వారాలు ఎలిమినేషన్ ముప్పుకు గురయ్యాడు. ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకొని ఎలా విజేత అవుతాడో అనే విషయం ఆసక్తిగా మారింది.

బాలనటుడిగా
కౌశల్ బాలనటుడిగా టెలివిజన్ సిరీయల్‌లో నటించారు. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం రాజకుమారుడు చిత్రం ద్వారా సినీ తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాల్లో నటించాడు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాడు.


Click it and Unblock the Notifications











