For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవును కమిటెడ్ కానీ.. రిలేషన్ షిప్‌పై ప్రశ్నించిన నెటిజన్‌కు కీర్తి సురేష్ రిప్లై వైరల్!

    |

    కీర్తి సురేష్ సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఉండదు. లైవ్ సెషన్స్ పెట్టి ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వదు. కనీసం లైవ్‌లోకి వచ్చి నెటిజన్లను పలకరించదు. తన బిజీలో తాను ఉంటుది. అయితే పర్సనల్ విషయాలను, షూటింగ్ అప్డే‌ట్‌లను ఇస్తూ ఫుల్ హల్చల్ చేస్తుంటుంది. తాజాగా కీర్తి సురేష్ మిస్ ఇండియా చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. లాక్ డౌన్‌లో కీర్తి సురేష్ ఓటీటీ ప్లాట్ ఫాంపై రచ్చ చేస్తోంది. ఆ మధ్య పెంగ్విన్ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చింది. తాజాగా మిస్ ఇండియా కూడా పెంగ్విన్ ఫలితాన్నే ఇచ్చింది.

    మిస్ ఫైర్ అయింది..

    మిస్ ఫైర్ అయింది..

    కీర్తిసురేష్ మిస్ ఇండియా మిస్ ఫైర్ అయింది. కీర్తి సురేష్ తన పాత్రకు న్యాయం చేసింది. కానీ సినిమా మొత్తాన్ని నడిపించలేకపోయింది. కథ బాగానే ఉన్నా కథనం గాడి తప్పింది. నేల విడిచి సాము చేసినట్టు రాసుకున్న సిల్లీ సీన్స్‌తో మిస్ ఇండియా ఘోరంగా దెబ్బతింది. అయితే నిన్న ఈ మూవీ రిలీజైంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మొదటిసారిగా ట్విట్టర్‌లో లైవ్ సెషన్ పెట్టేసింది.

    లేటుగా అయినా..

    లేటుగా అయినా..

    అయితే కీర్తి సురేష్‌కు ఇదే మొదటి లైవ్ సెషన్ కావడంతో కాస్త తడబడినట్టు కనిపించింది. రిప్లై ఇవ్వడంలోనూ చాలా ఆలస్యం చేసింది. నెటిజన్లు మాత్రం ఐదు గంటల నుంచే కీర్తి సురేష్ మీద ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. కీర్తి మాత్రం తాపీగా ఎప్పుడో ఆలస్యంగా రిప్లై ఇచ్చింది. అయినా కూడా కీర్తి మాత్రం అదిరిపోయే ఆన్సర్లను ఇచ్చింది.

    ఎన్నో ప్రశ్నలు..

    ఎన్నో ప్రశ్నలు..

    మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అని అడిగితే.. ఏడో నంబర్‌ను ట్వీట్ చేస్తూ ఎల్లప్పుడూ ధోనియే అని చెప్పింది. ఫ్యాన్స్ అంటే ఏంటి? అని అడిగితే.. నా కుటుంబం అంటూ చెప్పేసింది. హారర్ కామెడీలలో ఏది ఇష్టమని అడిగితే.. చూసేందుకు హారర్ చేసేందుకు కామెడీ చిత్రాలని తెలివిగా సమాధానం ఇచ్చింది.

    సమంత గురించి..

    సమంత గురించి..

    సమంత గురించి ఒక్క పదంలో చెప్పండని ఓనెటిజన్ అడిగాడు. సమంత గురించి ఒక్క పదంలో అంటే సరిపోదు చెప్పలేను అని తెలిపింది. ఎంతో తెలివైంది.. ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది.. స్ఫూర్తినింపుతూ ఉంటుందని కీర్తిసురేష్ చెప్పుకొచ్చింది.

    సింగిల్? కమిటెడ్?

    సింగిల్? కమిటెడ్?

    మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ మీరు సింగిలా? కమిటెడా? అని రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడిగాడు. ఆ ట్వీట్‌కు కీర్తి సురేష్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. కమిటెడ్ కానీ పనిపట్ల కమిటెడ్ అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది. మళ్లీ బబ్లీ కీర్తి సురేష్‌ను ఎప్పుడు చూడగలమని అడిగితే.. త్వరలోనే అని సమాధానం ఇచ్చింది.

    English summary
    Keerthy Suresh About Her Relationship Status, Keerthy Suresh Twitter Live session.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X