సూర్యుడిని చేతితో పట్టేసుకుందట.. కీర్తి సురేష్ పోస్ట్ వైరల్
కీర్తి సురేష్ సోషల్ మీడియాను ఎలా ఊపేస్తుంటుందో అందరికీ తెలిసిందే. తెరపై ఎంత చక్కగా సంప్రదాయబద్దంగా కనిపిస్తుందో.. సోషల్ మీడియాలోనూ అంతే అందంగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా వల్గారిటీకి చోటివ్వకుండా పద్దతిగా కనిపిస్తుంటుంది. అందుకే కీర్తి సురేష్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కీర్తి సురేష్ చేసే అల్లరి, తన పెట్‌తో కలిసి చేసే సందడిని నెటిజన్లు ఇష్టపడుతుంటారు.
కీర్తి సురేష్ తన పెట్ నైక్‌ను వదిలి ఉండదు. ఎప్పుడైనా షూటింగ్ కోసం బయటకు వెళ్లాల్సి వస్తే వీడియో కాల్‌లోనైనా నైక్‌ను రోజూ పలకరిస్తూ ఉంటుంది. ఇక ఈ లాక్డౌన్ సమయంలో కీర్తీ సురేష్ పేరు బయటకు వచ్చినంతగా మరో హీరోయిన్ పేరు రాలేదు. వరుసగా సినిమాలతో పలకరిస్తూనే వచ్చింది. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మరో వైపు కొత్త సినిమా టీజర్లు, అప్డేట్లతో రచ్చ చేసింది.

ఇక మిస్ ఇండియా సినిమా కోసం స్పెయిన్‌లో ఎంజాయ్ చేసిన రోజులను తలుచుకుంటూ 2020కి గుడ్ బై చెప్పేస్తోంది. అక్కడ చేసిన బోటింగ్, పావురాలతో ఆడుకున్న ఆటలు, సాయంత్రం పూట సూర్యుడిని తన చేతిలో పట్టేశానంటూ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ కీర్తి సురేష్ రచ్చ రచ్చచేస్తోంది. ఇక సూర్యుడిని తన చేతితో పట్టేశానంటూ చెబుతూ దిగిన ఫోటో మాత్రం నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











