కీర్తి సురేష్ అలాంటిదే.. కనీసం అది కూడా చేతకాదు.. గుట్టు విప్పిన నిర్మాత
మహానటి కీర్తి సురేష్.. తెరపై ఎంత సౌమ్యంగా కనిపిస్తూ ఉంటుందో.. నిజ జీవితంలోనూ అంతే. ఎంత అందం ఉన్నా, పేరు వచ్చినా, ఒదిగి ఉంటుంది. అందుకే కీర్తి సురేష్‌కు వ్యక్తిగతంగానూ ఎంతో మంది అభిమానులున్నారు. కీర్తి సురేష్ నిజ జీవితంలో ఎంత మొహమాటుస్తురాలో.. ఆమె వ్యక్తిత్తం ఎటువంటిదో నిర్మాత స్వప్నాదత్ తాజాగా బయట పెట్టింది. కీర్తి సురేష్, స్వప్నా మధ్ నడిచిన సంభాషణ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ కీర్తి గురించి ఆ నిర్మాత ఏం చెప్పిందో ఓ సారి చూద్దాం.

మహానటి కలిపిన బంధం..
కీర్తి సురేష్ మహానటి సినిమాతో దక్షిణాదిన ఓ గౌరవాన్ని దక్కించుకుంది. నాటి మహానటి సావిత్రిని చూసినట్టే కీర్తి సురేష్‌ను చూసి ప్రేక్షకులు ఫీలయ్యారు. ఈ చిత్రంతో నిర్మాతలైన స్వప్నా దత్, ప్రియాంక దత్‌లకు కీర్తీ సురేష్ బాగా దగ్గరైంది. అప్పటి వీరంతా ఒకే ఫ్యామిలీలా చాలా సన్నిహితంగా ఉంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్..
కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే మిగతా హీరోయిన్ల మాదిరి కాకుండా.. సోషల్ మీడియాలో చాలా పద్దతిగా ఉంటుంది. హద్దులు దాటి ఎప్పుడు కూడా దుస్తులు ధరించదు. అలాంటి ఫోటోలను కూడా షేర్ చేయదు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఓ ఫోటో..
తాజాగా కీర్తి సురేష్ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఎవరికో హాయ్ చెబుతున్నట్టుగా ఫుల్ ఖుషీగా ఉంది. అయితే తాను ఏ సందర్భంలో అలా ఉంటుందో వివరించింది. స్వప్నాదత్‌ను చూసినప్పుడు అలా ఎక్సైట్ అవుతానని, ఎందుకుంటే అలా అయినా నాకు ఇవ్వాల్సిన పేమెంట్‌ను ఇస్తారని అంటూ తెగ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసింది. ఇక చివరగా మిస్ యూ స్వాప్ అంటూ హార్ట్ సింబల్‌ను పెట్టేసింది.
Recommended Video

అది కూడా చేత కాదు..
ఇక కీర్తి షేర్ చేసిన పోస్ట్‌పై స్వప్నాదత్ స్పందించింది. ఈ మేరకు మొదటగా కామెంట్ చేస్తూ.. నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నాను కీర్తి అని చెప్పుకొచ్చింది. మరో కామెంట్ చేస్తూ.. కీర్తి అభిమానులందరికీ ఓ విషయాన్ని చెప్పింది. ఈ క్రాక్ గర్ల్ కీర్తి కనీసం తన పేమెంట్ ఇవ్వమని కూడా అడగదని మహానటి గొప్పదనాన్ని బయట పెట్టింది.


Click it and Unblock the Notifications











