ఇంధ్రభవనంలా యష్ కొత్త ఇల్లు.. విలాసవంతమైన భవనం ఖరీదు ఎన్ని కోట్లో తెలుసా?

KGF: Chapter 1 మూవీ సంచలన విజయంతో యష్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. కేజీఎఫ్‌ మూవీకి ముందు ఎవరికీ తెలియని హీరో ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోల మధ్య చేరిపోయారు. కన్నడ రంగానికి కొత్త వెలుగు తేవడంలో యష్ కృషి ఎంతైనా ఉంది. అయితే కేజీఎఫ్ మూవీ ఆయనకు పాపులారిటీనే కాకుండా విలాసవంతమైన ఇంటిని అందించింది. యష్ వ్యక్తిగత, ప్రొఫెషనల్, ఆ భవనానికి సంబంధించిన వివరాలు ఇవే..

కేజీఎఫ్2పై లాక్‌డౌన్ దెబ్బ

కేజీఎఫ్2పై లాక్‌డౌన్ దెబ్బ

2018లో యష్ KGF: Chapter 1 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సీక్వెల్‌ KGF: Chapter 2ను ప్లాన్ చేశారు. అంతా సవ్యంగా సాగుతుందని అనుకొంటున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగింది. కేజీఎఫ్ మూవీ తర్వాత మూడేళ్ల నుంచి యష్ తదుపరి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఆకట్టుకొంటున్న యష్ నివాసం

ఆకట్టుకొంటున్న యష్ నివాసం

లాక్‌డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన యష్ తన ఫ్యామిలీతో క్వాలిటీ లైఫ్‌ను ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో తన పిల్లలు, భార్యతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. యష్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలోనే విలాసవంతమైన ఇంటి ఫోటోలు అందర్నీ ఆకర్షించాయి.

యష్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్

యష్ ఫ్యామిలీ ఫోటోలు వైరల్

యష్ తన భార్య రాధికా పండిట్, పిల్లలు ఆర్య, యథర్వతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. సంప్రదాయ పద్దతిలో ఉండే ఇంటి వాతావరణం విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇప్పటికే రెండు సంవత్సరాలుగా యష్ ఉంటున్న ఇంటి ఫోటోలు తాజాగా వైరల్ అవతున్నాయి. అభిమానులు షేర్ చేసిన ఫోటోలు క్రేజీగా మారాయి.

రూ.4 కోట్లకుపైగా వ్యయంతో

రూ.4 కోట్లకుపైగా వ్యయంతో

KGF అందించిన సక్సెస్ ఉత్సాహంతో యష్ ఫ్యామిలీ సొంత ఇంటి కలను సాకారం చేసుకొన్నారు. బెంగళూరులోని ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు. ఖరీదైన వైట్ మార్బుల్, వుడ్ ఫర్నిష్‌తో ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటి ఖరీదు రూ.4 కోట్లకుపైగానే ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు.

యష్ నటించిన చిత్రాలు

యష్ నటించిన చిత్రాలు

యష్ నటించిన చిత్రాల గురించి వివరాల్లోకి వెళితే... 2010లో మొదలశాల చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రాజధాని, కిరాతక, డ్రామా, గూగ్లీ, రాజా హుళీ, గజకేసరి, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, మాస్టర్ పీస్ సినిమాల్లో నటించారు. కేజీఎఫ్ చిత్రంతో కన్నడ సూపర్‌స్టార్‌గా మారారు.

జూలై 16వ తేదీన కేజీఎఫ్2

జూలై 16వ తేదీన కేజీఎఫ్2

ఇక యష్ కెరీర్ విషయానికి వస్తే.. హోంబెల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన K.G.F: Chapter 2 చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. సుమారు 100 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి తదితరులు నటించారు. ఈ చిత్రం జూలై 16వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X