తల్లి శ్రీదేవి అందాన్ని తలదన్నేలా ఖుషి కపూర్.. వైరల‌్‌గా గ్లామరస్ ఫోటోషూట్

దేశ సినీ పరిశ్రమను తన అందం, అభినయంతో ఏన్నో దశాబ్దాల పాటు ఏలిన శ్రీదేవి భూలోకంలో అతిలోక సుందరి ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే ఆమె ఆకస్మిక మరణం ఎంతో మందిని విషాదానికి గురిచేసింది. ఇప్పటికీ ఆమె లేని లోటును జీర్ణించుకోవడం చాలా కష్టంగా మారింది. అయితే శ్రీదేవి సినీ వారసత్వాన్ని నిలబెట్టే విధంగా ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రయత్నిస్తుండగా.. మరో కూతురు అతిలోక సుందరి దారిలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఖుషీ కపూర్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారనే విషయం పలు సందర్భాల్లో చర్చకు వచ్చింది. అయితే గత రెండేళ్లుగా కరోనావైరస్ పరిస్థితులు అలాంటి ప్రయత్నాలకు బ్రేక్ వేసిందనుకోవచ్చు.

ఇదిలా ఉండగా, ఇటీవల ఖుషీ కపూర్ షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అయింది. అద్భుతమైన అందంతో షూట్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. పడక గదిలో దిగిన ఫోటోను షేర్ చేసి.. నా బెడ్రూంకు నేనే యువరాణిని అంటూ కామెంట్ పెట్టింది. స్లీవ్ కట్ లాంగ్ ఫ్రాక్‌‌లో తన అందాలను ప్రదర్శించింది.

 Khushi Kapoor glamorous Photoshot goes viral

ఇక ఖుషీ కపూర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2000, నవంబర్ 5 తేదీన ముంబైలో జన్మించారు. ధిరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుకొన్నారు. ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో 4 లక్షల 30 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. త్వరలోనే వెండితెర దేవతగా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

అయితే ఖుషీ కపూర్ సోదరి జాన్వీ కపూర్ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన తొలి చిత్రం ధడక్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొన్నది. అయితే తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X