CCL 2024 బెంగాల్‌ టైగర్స్‌కు బెంగళూరు బుల్డోజర్స్ షాక్.. ఉత్కంఠ పోరులో కిచ్చ సుదీప్ జట్టు ఎలా గెలిచిందంటే?

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ 2024 టోర్నమెంట్‌లో భాగంగా త్రివేండ్రంలోని కేరళలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కర్ణాటక బుల్డోజర్, బెంగాల్ టైగర్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో కర్ణాటక జట్టు ఫీలింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌ పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగాల్ జట్టు సభ్యులు వివరాలు
జిషు సేన్ గుప్తా (కెప్టెన్), బొన్నీ, జామ్మీ, జాయ్, యూసఫ్, సౌరవ్ దాస్ (వికెట్ కీపర్), సత్‌దీప్, తారాన్‌దీప్, ఆదిత్య, ఉదయ్, రాహుల్, రత్నదీప్

కర్ణాటక బుల్డోజర్ జట్టులో
కిచ్చ సుదీప్ (కెప్టెన్), చందన్ (వికెట్ కీపర్), ప్రదీప్, జయరాం కార్తీక్, కరణ్ ఆర్యన్, రాజీవ్, కృష్ణా, మంజునాథ్ గౌడ, ప్రతాప్, సునీల్ రావు, త్రివిక్రమ్

CCL 2024 first Qualifier Match

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న కర్ణాటక బుల్డోజర్ జట్టు తొలి 10 ఓవర్లలో బెంగాల్ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఆరంభంలోనే రత్నదీప్, జాయ్ వెంటవెంటనే అవుట్ అయ్యారు. రత్నదీప్ 6 పరుగులు చేసి, కార్తీక్ 7 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత జామ్మీ, కెప్టెన్ జిషు సేన్ గుప్తా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూ అవసరమైనప్పుడు సింగిల్స్‌తో స్ట్రైక్‌ను రొటేట్ చేశారు. అలాగే పేలవమైన బంతులను బౌండరీకి తరలించారు. దాంతో నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక బుల్డోజర్ జట్టు ధాటిగానే బ్యాటింగ్ చేపట్టింది. అయితే వేగంగా పరుగులు సాధిస్తున్న ప్రదీప్ 5 ఫోర్లతో అలజడి సృష్టించాడు. కానీ అనూహ్యంగా 17 బంతుల్లో 23 పరుగులు చేసి సత్‌దీప్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వా త చందన్ కూడా 7 బంతుల్లో 9 పరుగులు చేసి రత్నదీప్ బౌలింగ్ అవుట్ అయ్యాడు.

CCL 2024 first Qualifier Match

ఆ తర్వాత 11 బంతుల్లో 12 పరుగులు చేసిన డార్లింగ్ కృష్ణ నిరాశపరిచాడు. కృష్ణ ఈ సీజన్‌లో బ్రహ్మండంగా రాణించి 300కుపైగా పరుగుల సాధించాడు. ఇక చివర్లో రాజీవ్ 10 బంతుల్లో 24 పరుగులు, కార్తీక్ 10 బంతుల్లో 24 పరుగులు, కరణ్ 4 బంతుల్లో 13 పరుగులు చేశాడు. దాంతో కర్ణాటక జట్టు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. దాంతో కర్ణాటక జట్టుకు 28 పరుగుల అధిక్యం లభించింది. బెంగాల్ టైగర్ జట్టులో రత్నదీప్ 2 వికెట్లు, జామీ, సతాదీప్ చెరో వికెట్ పడగొట్టారు.

బెంగళూరు జట్టు ఉంచిన 28 పరుగుల అధిక్యాన్ని టార్గెట్‌గా చేసుకొని బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రాహుల్ 15 పరుగులు, జిషు 12 పరుగులు, జామ్మీ 15 పరుగులు చేసి అవుటాయ్యారు. యూసఫ్ ధాటిగా ఆడటం.. 18 బంతుల్లో 34 పరుగులు చేయడంతో బెంగాల్ 6 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో కరణ్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడొగట్టాడు.

Karnataka Bulldozers

ఇక 99 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక జట్టులో ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. ఓ దశలో కష్టసాధ్యంగా కనిపించిన లక్ష్యం భారీ షాట్ల కారణం విజయం సులభమైంది. కరణ్ 12 బంతుల్లో కరణ్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 22 పరుగులు చేసి అవుటాయ్యారు. ఆ తర్వాత కార్తీక్, రాజీవ్ పరుగుల వేగం పెంచారు. రాజీవ్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 14 బంతుల్లో 40 పరుగులు చేశాడు. దాంతో 9 ఓవర్లలోనే విజయాన్ని చేజిక్కించుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X