మాజీ ప్రేమికుడిపై కిమ్ శర్మ కామెంట్.. నటిపై నెటిజన్స్ సెటైర్స్

ప్రేమలు, బ్రేకప్‌లు సినీ, క్రీడా రంగాల్లో సర్వసాధారణం. అదేంటో గానీ సినీ, క్రీడా రంగానికి విడదీయలేని బంధం ఏర్పుడుతూ ఉంటుంది. సినీ హీరోయిన్లు, క్రికెటర్లు ప్రేమలో పడటం యాధృచ్చికంమో ఏమో గానీ ఇప్పటికీ కొన్ని రహస్య బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే విరాట్ కోహ్లీ, అనుష్కలు మాత్రమే తమ ప్రేమలో విజయం సాధించి ఒక్కటయ్యారు.

 ప్రేమలో విఫలం..

ప్రేమలో విఫలం..

టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ ప్రేమలో ఓడిపోయాడు. ఖడ్గం ఫేమ్ కిమ్ శర్మతో నాలుగేళ్లు ప్రేమాయణం నడిపించాడు. అయితే అది పెళ్లి పీఠల వరకు వెళ్లలేదు. మధ్యలోనే ముగిసింది. ఆపై ఎవరి దారి వారు చూసుకున్నారు. అది వేరే విషయమనుకోండి. తాజాగా వీరిద్దరి రిలేషన్ మళ్లీ వార్తల్లోకి ఎక్కడానికి ఓ కారణం ఉంది.

రిటైర్మెంట్‌కు ఏడాది..

రిటైర్మెంట్‌కు ఏడాది..

సిక్సర్ల కింగ్‌ యువరాజ్ రిటైర్మెంట్‌ ప్రకటించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అయింది. మిస్ యూ యూవీ అని ఫ్యాన్స్‌తో పాటు క్రికెటర్స్ కూడా ట్వీట్లు చేశారు. అయితే యువీ మాత్రం ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

 పోస్ట్‌కు స్పందించిన మాజీ లవర్..

పోస్ట్‌కు స్పందించిన మాజీ లవర్..

‘డియర్‌ ఫ్యాన్స్‌ మీ ప్రేమకు నేను పొంగిపోయాను. నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. మీరంతా నాలో భాగమైనట్టే నా జీవితంలో క్రికెట్‌ ఎప్పటికీ ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా కరోనా వైరస్‌పై ప్రభుత్వం చెప్పే నియమాలు పాటించండి. అవసరంలో ఉన్న వారికి చేతనైనంత సాయం చేయండి' అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దీనిపై కిమ్ శర్మ స్పందించింది.

 గోట్ అంటూ కామెంట్..

గోట్ అంటూ కామెంట్..

G.O.A.T(Greatest Of All Time) అంటూ యూవీని పొగిడేసింది. అయితే దీని అర్థం తెలియని కొందరు ఆమెపై సెటైర్స్ వేస్తున్నారు. మరి కొందరు పూర్తిగా రాస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా? మొత్తానికి టైమ్ సేవ్ చేసుకున్నావని కామెంట్స్ చేశారు. ఇక కొందరు మాత్రం నిజంగానే గొర్రెను చేశావులే అని నాటి సంగతులను తవ్వితీశారు. మొత్తానికి కిమ్ శర్మ రిప్లై మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

 చెరోదారి..

చెరోదారి..

వీరిద్దరి విడిపోయిన అనంతరం.. కిమ్ శర్మ2010లో కెన్యా వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లి చేసుకుంది. ఆయనతో కూడా విడిపోయిన కిమ్ శర్మ.. నటుడు హర్షవర్దన్ రానేతో డేటింగ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇక యువీ సైతం హాలీవుడ్‌ నటి హజెల్‌ కీచ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X