హృదయం మూగబోయింది... దుఖాన్ని దిగమింగుకోలేకపోతున్నా.. అనుష్క, వెంకటేష్, మంచులక్ష్మీ ఎమోషనల్

శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ మృతితో దక్షిణాది చిత్ర పరిశ్రమ మూగబోయింది. ఆయన మరణ వార్త విన్న వెంటనే సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తమ బాధను, ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని, అనుబంధాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్విట్టర్‌లో స్పందించిన పలువురు సినీ ప్రముఖులు వివరాలు..

తీవ్ర విషాదంలో మునిగిపోయా

తీవ్ర విషాదంలో మునిగిపోయా

కోడి రామకృష్ణ మృతితో తీవ్ర విషాదంలో కూరుకుపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అని శ్రీకాంత్ ట్వీట్ చేశారు.

పరిశ్రమకు తీరని లోటు

పరిశ్రమకు తీరని లోటు

తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. తనదైన విజన్‌తో సినిమా పరిశ్రమకు విశేష కృషిని చేశారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. అమ్మోరు, అరుంధతి, మంగమ్మగారి మనవడు, అంకుశం లాంటి చిత్రాలను అందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాను అని మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు.

హీరో కార్తికేయ ట్వీట్

హీరో కార్తికేయ ట్వీట్

మీ సినిమాలు అమ్మోరు, దేవీ, దేవీపుత్రుడు, అంజి, అరుంధతి చిత్రాలు చూస్తూ పెరిగాం. వెండితెర మీద అద్భుతమైన గ్రాఫిక్స్‌తో మ్యాజిక్ చేసిన వారిలో మీరే నంబర్ వన్. గొప్ప విజన్‌తో సినిమాలను అందించిన కోడి రామకృష్ణ మనమధ్య లేకపోవడం బాధకరం. భౌతికంగా మీరు లేకపోయిన మీ విజన్ మాకు స్ఫూర్తిగా నిలుస్తుంది సార్ అని హీరో కార్తికేయ ట్వీట్ చేశారు.

మూడు దశాబ్దాలకుపైగా

మూడు దశాబ్దాలకుపైగా

కోడి రామకృష్ణ ఇకలేరనే వార్తతో విషాదానికి లోనయ్యాను. మూడు దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు విశేష సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ప్రముఖ సినీ రచయిత పులగం చిన్నారాయణ ట్వీట్ చేశారు.

 గ్రాఫిక్ టెక్నాలజీతో

గ్రాఫిక్ టెక్నాలజీతో

ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ మృతి వార్తతో విషాదం నిండింది. గ్రాఫిక్ టెక్నాలజీతో ఆయన అందించిన విధంగా మరొకరు సినిమాలను అందించలేదు. సినీ పరిశ్రమలో ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని గాయని కౌసల్య ట్వీట్ చేశారు.

హృదయం మూగబోయింది..

హృదయం మూగబోయింది..

గొప్పవ్యక్తి, దర్శకులు కోడి రామకృష్ణ మరణంతో నా హృదయం మూగబోయింది. దుఖాన్ని దిగమింగుకోలేకపోతున్నాను. మీ తియ్యని మాటలు మా హృదయాల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు తెరకెక్కించిన ఎవర్ గ్రీన్ చిత్రాలు మిమ్మల్ని సజీవంగా నిలుపుతాయి అని అనుష్క ట్వీట్ చేశారు.

మీరు లేని లోటు పూడ్చలేనిది

మీరు లేని లోటు పూడ్చలేనిది

మీరు లేని లోటు పూడ్చలేనిది. ఎన్నో గొప్ప చిత్రాలను అందించినందుకు థ్యాంక్స్. మీ ఆత్మకు శాంతి కలుగాలి. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని వెంకటేశ్ అన్నారు.

 మీ మరణవార్తతో కుంగిపోయాను

మీ మరణవార్తతో కుంగిపోయాను

లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇక లేరనే వార్తతో కుంగిపోయాను. మీరు ఎప్పుడూ మా హృదయాల్లో ఉంటారు. మీ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని వేడుకొంటున్నాను అని యాంకర్ రవి ట్వీట్ చేశారు.

మీ లెగసీ ఎల్లకాలం

మీ లెగసీ ఎల్లకాలం

దర్శకులకు గురువు లాంటి కోడి రామకృష్ణ మృతితో విషాదంలో మునిగిపోయాం. మీ లెగసీ ఎల్లకాలం ఉంటుంది సార్. మీ ఆత్మకు శాంతి కలుగాలి. కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం అని కొరటాల శివ ట్వీట్ చేశారు.

 మీ తరంలో మీరు కూల్

మీ తరంలో మీరు కూల్

కోడి రామకృష్ణ ఆయన తరంలో చాలా కూల్ వ్యక్తి. హెడ్ బ్యాండ్‌తో కనిపించే ఆయనను కోల్పోవడం బాధకరం. మీ సినిమాలతో మీరు గుండెల్లో పదిలంగా ఉంటారు సార్ అని నాని ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X