twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూతురు ముందే సెక్స్ లైఫ్ గురించి: సైఫ్ అలీ ఖాన్ చేష్టలతో ఇబ్బంది పడ్డ సారా!

    |

    బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తన కూతురు సారా అలీ ఖాన్‌తో కలిసి ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' 6వ సీజన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారా అలీ ఖాన్ ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నారు. సైఫ్ తన సెక్స్ లైఫ్ గురించి మాట్లాడుతుంటే... ఆ మాటలు వినడానికి ఇబ్బంది పడుతూ చెవులు మూసుకున్నారు.

    ఆ ముద్దులేంటి? లవ్ జిహాద్‌ను ప్రేరేపిస్తోంది: 'కేదార్‌నాథ్' మూవీని నిషేధించాలి!ఆ ముద్దులేంటి? లవ్ జిహాద్‌ను ప్రేరేపిస్తోంది: 'కేదార్‌నాథ్' మూవీని నిషేధించాలి!

    తాజాగా విడుదలైన 'కాఫీ విత్ కరణ్ 6' ప్రోమోలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు వీక్షకులను ఆశ్చర్య పరిచాయి. ఈ వారాంతం ప్రసారం అయ్యే ఈ షోపై ప్రోమో అంచనాలు మరింత పెంచింది. తండ్రి కూతుళ్లకు కరణ్ జోహార్ ఎవరూ ఊహించని ప్రశ్నలు సంధించారు.

     బెడ్రూం లైఫ్‌తో మొదలు పెట్టి

    బెడ్రూం లైఫ్‌తో మొదలు పెట్టి

    సైఫ్ అలీ ఖాన్ బెడ్రూం లైఫ్‌తో కరణ్ తన డిస్క్రర్షన్ మొదలు పెట్టారు. కరీనా జిమ్ లుక్ చాలా సెక్సీగా ఉందని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏమిటి? అంటూ సైఫ్‌ను కరణ్ ప్రశ్నించారు. ఆమెను నేను బెడ్రూంలో చాలా క్లోజ్‌గా చూస్తాను అంటూ సమాధానం ఇచ్చారు.

    చెవులు మూసుకున్న సారా

    చెవులు మూసుకున్న సారా

    కరణ్ జోహార్ అడిగిన వెంటనే సైఫ్ తన సెక్స్ లైఫ్ గురించి ఓపెన్‌గా మాట్లాడుతుంటే.... పక్కనే ఉన్న ఆయన కూతురు సారా ఇబ్బంది పడుతూ చెవులు మూసుకున్నారు. అయినప్పటికీ సైఫ్ ఏమాత్రం సంకోచించకుండా తను చెప్పాల్సింది చెప్పేశాడు.

     కూతురు బాయ్ ఫ్రెండ్ గురించి

    కూతురు బాయ్ ఫ్రెండ్ గురించి

    కూతురుకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే... మీరు మొదట తెలుసుకునే మూడు ముఖ్యమైన విషయాలు ఏమిటి? అని కరణ్ ప్రశ్నించగా సైఫ్ స్పందిస్తూ.... ‘పొలిటిక్ వ్యూస్, డ్రగ్స్...' అనే లోపే కరణ్ కల్పించుకుని అతడి డబ్బు గురించి కూడా కనుక్కుంటారా? అంటూ వ్యాఖ్యానించారు. దానికి సైఫ్ రిప్లై ఇస్తూ తప్పకుండా... అతడికి బాగా డబ్బుంటే నాకేమీ అభ్యంతరం లేదు అని సమాధానం ఇచ్చారు.

     అలా మాట్లాడటం ఆపండి నాన్న

    అలా మాట్లాడటం ఆపండి నాన్న

    నీ నోటి నుంచి డబ్బు గురించిన మాట రావడం చాలా చెత్తగా ఉంది. అలా మాట్లాడటం ఆపండి నాన్న అంటూ సారా అలీ ఖాన్ వ్యాఖ్యానించారు.

    రణబీర్‌తో పెళ్లి, కార్తిక ఆర్యన్‌తో డేటింగ్

    పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటారు? డేటింగ్ చేయాలనుకుంటే ఎవరిని ఇష్టపడతారు? అనే ప్రశ్నకు సారా స్పందిస్తూ.... ‘రణబీర్ కపూర్‌ను పెళ్లాడటానికి ఇష్టపడతాను. కార్తీక్ ఆర్యన్‌తో డేట్‌కు వెళతాను' అంటూ సమాధానం ఇచ్చారు.

    సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా

    సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా

    సారా అలీ ఖాన్ ‘కేదార్‌నాథ్' అనే బాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. అభిషేక్ కపూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్లో విడుదల కాబోతోంది.

    English summary
    In the latest promo of Koffee With Karan 6, Saif Ali Khan, in a freewheeling chat with Karan Johar, started discussing his bedroom-life. Sara Ali Khan put her hands on her ears to avoid listening more about her father and step mother's bedroom-life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X