బాలుడి పట్ల అనుష్క-కోహ్లి ప్రవర్తనపై విమర్శలు... అభిమానంతో ఇస్తే ఇలా చేస్తారా?
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి దంపతులు ఓ బాల అభిమాని పట్ల ప్రవర్తించిన తీరు నెటిజన్లకు కోపం తెప్పింది. దీంతో వారిపై తమ కామెంట్లతో విరుచుకుపడ్డారు. ముంబై ఎయిర్ పోర్టులో ఓ అభిమాని.... విరాట్-అనుష్క ఫోటోలతో కూడిన ఒక ఆల్బమ్ గిఫ్టుగా ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే అయితే కోహ్లి, అనుష్క దంపతులు దాన్ని కనీసం చూడనైనా చూడకుండా పక్కకు తోసేశారు. కనీసం ఆ బాలుడి సంతోషం కోసమైన తీసుకుని ఉండొచ్చు కదా అని కొందరు నెటిజన్లు ఈ సెలబ్రిటీ జంటపై మండి పడుతున్నారు.

అనుష్క, విరాట్ దంపతులు
ముంబై ఎయిర్ పోర్టుకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వస్తున్న విషయం తెలుసుకుని పలువురు అభిమానులు, మీడియా వారు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ బాల అభిమాని వారిపై తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు.

అస్సలు పట్టించుకోలేదు
చుట్టూ బాడీగార్డుల రక్షణలో ఉన్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లి దంపతుల వద్దకు ఓ బాలుడు వారి ఫోటోలతో తయారు చేసిన గిఫ్టును ఇవ్వడానికి ప్రయత్నించగా.... విరుష్క జంట కనీసం పట్టించుకోక పోవడం విమర్శలకు దారి తీసింది.

తల పొగరు అంటూ కామెంట్స్
అనుష్క, విరాట్ తీరుపై కొందరు రియాక్ట్ అవుతూ... మరీ ఇంత రూడ్‌గా, తల పొగరుగా ప్రవర్తించడం సరికాదని, కనీసం ఆ అబ్బాయి వయసు చూసైనా మీకు కనికరం కలగలేదా? ఒక క్షణం ఆగి ఆ బాలుడి వైపు చూసి చిరునవ్వు చిందిస్తే అతడు చాలా సంతోషపడేవాడు కదా... అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

గతంలోనూ వివాదాలు
గతంలో అనుష్క, విరాట్ దంపతులు తమ చర్యలతో వివాదాల్లో ఇరుక్కున్నారు. ఆ మధ్య ఓ వ్యక్తి రోడ్డు మీద బాటిల్ పడేయడాన్ని అనుష్క తప్పుబడుతూ ఫైర్ అవ్వడం, దాన్ని వీడియో తీసిన కోహ్లి సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











