twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయంలో తగ్గుతున్న కోలీవుడ్ హీరోలు.. మన హీరోలు కూడా తగ్గితే మంచిది?

    |

    లాక్ డౌన్ సినిమా నిర్మాతలను మాత్రం కోలుకోలేని దెబ్బ కొడుతోంది. కరోనా వైరస్ మొత్తం సినిమా ఇండస్ట్రీలనే టార్గెట్ చేసినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆకలి బాధలు ఒకరివైతే ఆర్థికంగా దెబ్బతిన్న వారు మరికొందరు. సినిమాలు రిలీజ్ కాకముందే నిర్మాతల జేబులకు చిల్లులు పడుతుండడంతో కొందరు హీరోలు వారికి సహాయంగా నిలుస్తున్నారు.

    నిర్మాతలను ఆదుకోండి..

    నిర్మాతలను ఆదుకోండి..

    ఒక సినిమా అద్భుతంగా వచ్చింది అంటే అందుకు ప్రధానమైన వ్యక్తి నిర్మాత. ఖర్చుకు వెనకాడకుండా కాస్ట్లీ సినిమా తీసి హిట్టు కొట్టాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో డబ్బుల విషయంలో డేర్ చేయడం చాలా కష్టం. సినిమా ప్లాప్ అయితే నిర్మాతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సినిమ కోసం కోట్లు కుమ్మరించే నిర్మాత పరిస్థితి ఇప్పుడు కాస్త ఇబ్బందిగా మారింది.

    షూటింగ్ దశలోనే..

    షూటింగ్ దశలోనే..

    షూటింగ్ దశలో ఉన్న చాలా సినిమాలు ఆగిపోయాయి. దీంతో ముందుగానే కొందరు ఇన్వెస్ట్ చేసి భారీ ప్లాన్ రెడీ చేసుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నటీనటులకు, టెక్నీషియన్స్ కి పేమెంట్స్ క్లియర్ చేసినవారే ఇప్పుడు ఆర్థికంగా దెబ్బ తిన్నారు. కొందరైతే ఫైనాన్స్ ద్వారా డబ్బులు తెచ్చి సినిమాల కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాంటి నిర్మతలపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపనుంది.

    కదిలిన కోలీవుడ్ హీరోలు..

    కదిలిన కోలీవుడ్ హీరోలు..

    నిర్మాతలను ఆదుకోవాలని కొంతమంది హీరోలు ముందుకు వస్తున్నారు. కోలీవుడ్ లో ఇప్పటికే విజయ్ ఆంటోనీ తన ముగ్గురు నిర్మాతలకు కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశాడు. అలాగే మరొక యాక్టర్ హరీష్ కళ్యాణ్ కూడా తన సాలరీలో కొంత తగ్గించుకొని నిర్మాతకు అండగా నిలిచాడు. సెట్స్ పై ఉన్న సినిమాలు ఆగిపోవడం నిర్మాతలకి తీరని నష్టాన్ని మిగులుస్తుంది. అందుకే కొంత మంది యాక్టర్స్ ఈ విధంగా ఆదుకుంటున్నారు.

    Recommended Video

    Poonam Pandey Condemns Her Arrest News
    మన హీరోలు కూడా..

    మన హీరోలు కూడా..

    తమిళ్ లో చాలా వరకు స్టార్ హీరోలు కూడా పారితోషికం విషయంలో ఆలోచించి కొంత డబ్బును నిర్మాతలకు ఇచ్చేస్తున్నారు. ఇక తెలుగులో ఆగిపోయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియదు. అందుకే తెలుగు హీరోలు కూడా వారి రెమ్యునరేషన్ ని కాస్త తగ్గించి నిర్మాతలకు అండగా ఉంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    English summary
    Lockdown is making irreparable damage to the filmmakers. Situations seem to have targeted the entire film industry as a corona virus. Hunger sufferers are financially vulnerable to others. Some of the heroes are supporting the filmmakers as they pile into the pockets of the producers before they are released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X