twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిహారిక కొణిదెల ఎంగేజ్‌మెంట్ డేట్ ఇదే.. మ్యారేజ్ డేట్ ఎప్పుడంటే?

    |

    మెగా ఫ్యాన్స్‌కు కొణిదెల ఫ్యామిలీ శుభవార్తను అందించారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల నిశ్చితార్తం, పెళ్లికి సంబంధించిన తేదీలను ప్రకటించారు. తన సోదరి వివాహనికి సంబంధించిన విషయాలను హీరో వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడించడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి కుదిరిందనే విషయాన్ని నిహారిక బయటపెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిహారిక ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్‌ డేట్ ఎప్పుడంటే..

    చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి

    చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి

    ఫలానా హీరోతో పెళ్లి అంటూ పలు గాసిప్స్, రూమర్ల మీడియాలో వైరల్ అయిన తర్వాత కొణిదెల నిహారిక వివాహం టెక్కీ చైతన్య జొన్నలగడ్డతో నిశ్చయమైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఉన్నత పోలీస్ అధికారి కుమారుడే చైతన్య జోన్నలగడ్డ అనే విషయం ఆ తర్వాత వెలుగులో వచ్చింది. అలాగే నిశ్చితార్థం జరిగిందనే వార్తను కూడా గతంలో ఫ్యామిలీ ఖండించింది.

    నిహారిక ఎంగేజ్‌మెంట్‌పై ఊహాగానాలకు చెక్

    నిహారిక ఎంగేజ్‌మెంట్‌పై ఊహాగానాలకు చెక్

    ఇక లాక్‌డౌన్ పరిస్థితుల మధ్య నిహారిక ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ డేట్లపై వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. అయితే ఆ వార్తలపై మెగా ఫ్యామిలీ ప్రధానంగా నాగబాబు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏ వార్తపై కూడా స్పందించలేదు. అయినా నిహారిక పెళ్లి తేదీలు, ఇతర సెలబ్రేషన్స్ తేదీలపై ఊహాగానాలు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.

    ఆగస్టులో ఎంగేజ్‌మెంట్

    ఆగస్టులో ఎంగేజ్‌మెంట్

    ఇక మీడియాలో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ తాజాగా హీరో వరుణ్ సందేశ్ తన సోదరి పెళ్లి నిశ్చితార్థం గురించి మీడియాకు హింట్ ఇచ్చారు. ఆగస్టు నెలలో నిహారిక ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. డిసెంబర్‌లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాం అని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. దీంతో ఎంగేజ్‌మెంట్ రూమర్లకు తెరపడింది.

    కుటుంబ వేడుకగా నిశ్చితార్థం

    కుటుంబ వేడుకగా నిశ్చితార్థం

    నిహారిక ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని కేవలం కుటుంబ వేడుకగా చేస్తున్నామని ఇప్పటికే నాగబాబు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకొని.. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా నిహారిక ఎంగేజ్‌మెంట్ వేడుకను నిర్వహిస్తామని స్వయంగా ఆయన వెల్లడించారు. ఇంకా ఎంగేజ్‌మెంట్‌ కోసం ఆహ్వానితుల జాబితాను ఫైనలైజ్ చేయలేదని కొద్ది రోజుల క్రితం వెల్లడించారు.

    Recommended Video

    Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
    ఆగస్టు 13న నిశ్చితార్థం, పెళ్లి డిసెంబర్‌లో

    ఆగస్టు 13న నిశ్చితార్థం, పెళ్లి డిసెంబర్‌లో

    అయితే తాజా సమాచారం ప్రకారం.. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల నిశ్చితార్థం ఆగస్టు 13న నిర్వహించేందుకు, అలాగే పెళ్లిని డిసెంబర్‌లో నిర్వహించేందుకు కొణిదెల ఫ్యామిలీ సిద్ధమైంది. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా నిహారిక ఎంగేజ్‌మెంట్‌ను ఫ్యామిలీ అఫైర్‌గా చేయనున్నట్టు తెలిసింది.

    English summary
    Konidela Niharika wedding news once again in media goes viral. Reports suggest that, Niharika was engaged to groom which from Guntur. As per reports, Niharika, Chaitanya Jonnalagadda engagement will be on August 13th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X