twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణకు సోదరిగా విజయ నిర్మల... అంగీకరించని ప్రేక్షకులు, అవన్నీ ప్లాపులే!

    |

    ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల బుధవారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశాను. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 73 సంవత్సరాలు.

    విజయ నిర్మల నట ప్రస్థానం 7 ఏళ్ల వయసులోనే మొదలైంది. నటిగా సక్సెస్ అవ్వడంతో పాటు దర్శకురాలిగా అత్యధిక చిత్రాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. కృష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన తొలి చిత్రం 'సాక్షి'. 1967లో వచ్చిన ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు.

    ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు

    ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు

    ‘సాక్షి' ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 30రోజులు గోదావరి తీరంలోని పులిదిండిలో అవుట్‌డోర్‌ షూటింగ్ ప్లాన్‌ చేయడంతో ఇద్దరికీ ఎక్కువ సమయం కలిసి గడిపే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే మనసులు మరింత దగ్గరయ్యాయి. ఈ షూటింగ్ జరిగిన రెండేళ్లకు 1969లో కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకున్నారు.

    వీరి పెళ్లి మీసాల కృష్ణుడి మహిమేనా?

    వీరి పెళ్లి మీసాల కృష్ణుడి మహిమేనా?

    పులిదిండి గ్రామంలో ఓ గుడి ఉంది. ఇందులో కృష్ణుడికి మీసాలు ఉండటంతో మీసాల కృష్ణుడు అని పిలిచేవారు. మీసాల కృష్ణుడు చాలా పవర్ ఫుల్ అనే పేరుంది. ‘సాక్షి' షూటింగులో భాగంగా ఓ పాటను ఇదే గుడిలో చిత్రీకరించారు. ఇందులో కృష్ణ, విజయ నిర్మలను పెళ్లి దుస్తుల్లో నటించారు. ఆ సమయంలో హాస్యనటుడు రాజబాబు కొంగు ముడేసుకుని పెళ్లి దుస్తుల్లో ఉన్న వారిని చూసి ‘ఇక్కడి మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్‌, మిమ్మల్ని నిజంగానే దంపతులను చేస్తాడేమో‌' అన్నారట. తర్వాత ఆయన మాటే నిజమైంది.

    కృష్ణకు సోదరిగా విజయ నిర్మల... అంగీకరించని ప్రేక్షకులు

    కృష్ణకు సోదరిగా విజయ నిర్మల... అంగీకరించని ప్రేక్షకులు

    కృష్ణ, విజయ నిర్మల హీరో హీరోయిన్లుగా 47 చిత్రాల్లో జంటగా నటించారు. అయితే బొమ్మలు చెప్పిన కథ, మంచి మిత్రులు, ముహూర్త బలం చిత్రాల్లో విజయ నిర్మల కృష్ణ సోదరి పాత్రలో నటించారు. వీరిని తెరపై తోబుట్టువులుగా ప్రేక్షకులు అంగీకరించలేకపోయారు. ఈ మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి.

    ఇకపై అలా చేయొద్దని నిర్ణయం

    ఇకపై అలా చేయొద్దని నిర్ణయం

    బొమ్మలు చెప్పిన కథ, మంచి మిత్రులు, ముహూర్త బలం మూడు చిత్రాలు ప్రేక్షకుల నుంచి తిరస్కరణకు గురి కావడంతో ఒకపై అన్నా చెల్లెళ్లుగా నటించకూడదని కృష్ణ-విజయ నిర్మల నిర్ణయించుకున్నారు. విజయ నిర్మల దర్శకురాలిగా రాణించడంలో కృష్ణ ప్రోత్సాహం కూడా చాలా ఉంది.

    English summary
    Krishna and Vijaya Nirmala actred as siblings in Bommalu Cheppina Katha, Manchi Mitrulu, Muhurtha Balam. Vijaya Nirmala was an Indian film actress, producer and director known for her works predominantly in Telugu cinema. She has directed 44 films in Telugu. In 2002, she entered the Guinness Book of Records as the female director of the most films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X