సౌందర్య రంగులు మారే చీర.. పెద్ద ట్విస్టే చెప్పిన కృష్ణవంశీ
తెలుగు సినిమా దగ్గర తెలుగు హీరోయిన్ కాకపోయినప్పటికీ తెలుగు సినిమా హీరోయిన్ నే అన్న స్థాయిలో అంతా తమ ఇంటి ఆడపిల్లలా ఫీల్ అయ్యేలా చేసుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉంటారు. ఇక ఇప్పుడు జెనరేషన్ లో అయితే అసలు పెర్ఫామెన్స్ అందంతో అలాంటి భావన కలిగించే హీరోయిన్స్ నే చాలా కరువయ్యారు. కానీ అప్పట్లో హీరోయిన్స్ అని అందం అభినయం, అణుకువ అన్నీ కలగలిపి ఎంటర్టైన్మెంట్ అందించారు.
మరి ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అనేది అది దివంగత హీరోయిన్ సౌందర్య అనే చెప్పాలి. తెలుగు, తమిళ్ కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు సౌందర్య. అన్ని ఇండస్ట్రీస్ లో కూడా టాప్ హీరోయిన్ గా నిలిచిన ఆమె కెరీర్ లో ఎన్నో క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ హిట్ చిత్రాల్లో మన తెలుగు దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఐకానిక్ హిట్ చిత్రం "అంతఃపురం" సినిమా కూడా ఒకటి.

కాగా ఈ చిత్రంలో జగపతిబాబు, సాయి కుమార్ లు కూడా నటించగా సాయి కుమార్ సరసన హీరోయిన్ గా సౌందర్య నటించారు. అయితే ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం కూడా పెద్ద ఎసెట్ కాగా ఇందులో సాయి కుమార్ సౌందర్య పై చార్ట్ బస్టర్ సాంగ్ అసలేం గుర్తుకు రాదు సాంగ్ ఎవరూ మర్చిపోలేరు. అయితే ఇందులో ఇంకా హైలైట్ ఏంటంటే వెంటవెంటనే సౌందర్య ధరించిన చీర రకరకాల రంగులు మారుతూ కనిపించడం 90ల కిడ్స్ కి అయితే ఒక వింత.
చిన్నపుడు టీవీల్లో జెమినీ పాటలు చూస్తున్నపుడు అందరికీ అది ఒక వండరే.. అయితే అసలు దీనిపై దర్శకుడు కృష్ణవంశీ ఒక ఊహించని ట్విస్ట్ రివీల్ చేశారు. తాను అసలు సినిమాలో నార్మల్ గానే తీశానని కానీ టీవీ లోకి వచ్చేసరికి జెమినీ టీవీ వారు అలా ఎడిట్ చేసి రిలీజ్ చేసారని ఆ ఐడియా తనది కాదని ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. దీనితో ఇన్నేళ్ల నుంచి అదే నిజం అనుకుంటున్నా వారికి సోషల్ మీడియాలో ఫ్యుజ్ లు ఎగిరిపోయాయి.
దీనితో ఒరిజినల్ గా ఎలా ఉంటుందా అని వెతకడం స్టార్ట్ చేశారు. మొత్తానికి అయితే ఈ సినిమా విషయంలో కృష్ణ వంశీ ఇచ్చిన షాక్ ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. కాగా కృష్ణ వంశీ లాస్ట్ సినిమా "రంగమార్తాండ" చేయగా ఈ సినిమా తర్వాత కొత్త సినిమా ఇంకా స్టార్ చేయాల్సి ఉంది. అలాగే రీసెంట్ గానే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, తన కోసం సూపర్ ఐడియా కూడా తన దగ్గర సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే మహేష్ బాబు ఇంటర్నేషనల్ స్టార్ తనతో మళ్ళీ సినిమా చేయడం అసాధ్యం అని కూడా చెప్పారు. కాగా ఇప్పుడు మహేష్ తో చేసిన క్లాసిక్ హిట్ చిత్రం "మురారి" రీ రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











