For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishnam Raju Net Worth: కృష్ణంరాజుకు అన్ని కోట్ల ఆస్తులు.. అప్పట్లోనే అంత రెమ్యూనరేషన్‌తో రికార్డు

  |

  సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రెబెల్ స్టార్ కృష్ణంరాజు. హీరోగా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా ఏర్పరచుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయారు.

  అప్పటి నుంచి ఆయన ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చారు. అలాగే, రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేసుకుని దేశ వ్యాప్తంగా పేరును సంపాదించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు, నికర ఆదాయం, రెమ్యూనరేషన్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి!

  అనారోగ్యంతో కృష్ణంరాజు మృతి

  అనారోగ్యంతో కృష్ణంరాజు మృతి

  కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతోన్న కృష్ణంరాజు (83).. ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగానే పరిస్థితి విషమించింది. దీంతో ఆయన ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు తుది శ్యాస విడిచారు.

  Manchu Manoj రెండో పెళ్లి.. కాబోయే శ్రీమతితో పూజలు.. ఎవరీ మౌనికారెడ్డి?

  రెండు రంగాలకు తీరని లోటుగా

  రెండు రంగాలకు తీరని లోటుగా

  సుదీర్ఘమైన ప్రయాణంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను వేసుకుని.. ఎన్నో రకాల సేవలను అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరణించడం ఈ రెండు రంగాలకు తీరని లోటును మిగిల్చిందనే చెప్పాలి. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు మరణంతో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

   రాజుల ఫ్యామిలీ... అన్నింట్లోనూ

  రాజుల ఫ్యామిలీ... అన్నింట్లోనూ


  రెబెల్ స్టార్ కృష్ణంరాజు క్షత్రియ వంశానికి చెందిన వారన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన మొదటి నుంచీ రాజసాన్ని చూపించేలా వ్యవహరించేవారు. వ్యక్తిత్వంలోనూ, వ్యవహారశైలిలోనూ, సేవాగుణంలోనూ తనకు తానే సాటి అని అనిపించుకున్నారు. అందుకే ఆయన అప్పట్లోనే యమ ఫేమస్ అయ్యారు. ఫాలోయింగ్‌ను భారీగా ఏర్పరచుకున్నారు.

  Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!

  అప్పట్లోనే అంత రెమ్యూనరేషన్

  అప్పట్లోనే అంత రెమ్యూనరేషన్

  కృష్ణంరాజు మృతితో ఆయన గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన రెమ్యూనరేషన్ గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చింది. కృష్ణంరాజు హీరోగా పరిచయమైన కొత్తలో రూ. 1.16 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అప్పట్లో ఇది చాలా ఎక్కువ అని తెలిసింది. ఆ తర్వాత ఇలానే భారీ రెమ్యూనరేషన్‌తో రికార్డులు క్రియేట్ చేశారు.

   కృష్ణంరాజుకు కోట్లలోనే ఆస్తులు

  కృష్ణంరాజుకు కోట్లలోనే ఆస్తులు

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు క్షత్రియ వంశానికి చెందిన వారు కావడంతో గోదావరి జిల్లాలో ఆయన పేరిట ఎన్నో ఆస్తులు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అలాగే, హీరోగా మారిన తర్వాత చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఎంతో విలువైన ఆస్తులను కొనుగోలు చేసుకున్నారు. వాటి విలువ ఇప్పుడు దాదాపు రూ. 500 కోట్ల వరకూ ఉంటుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  Krishnam Raju No More: టాలీవుడ్‌లో పెను విషాదం.. కృష్ణంరాజు కన్నుమూత

  కార్లు.. ఇళ్లు.. వాటి విలువ కూడా

  కార్లు.. ఇళ్లు.. వాటి విలువ కూడా

  రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు మొగల్తూరులో ఓ పెద్ద భవనం ఉంది. అలాగే, హైదరాబాద్‌లోనూ ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది వీటి విలువ రూ. 200 కోట్లు వరకూ ఉంటుందట. అలాగే, ఆయన వాడే కార్లు, ఇతర వాహనాలు, యాక్ససిరీస్‌ల విలువ రూ. 20 - 30 కోట్ల విలువ ఉంటుందని సోషల్ మీడియా సమాచారం.

  మొత్తం నికర ఆదాయం ఎంత?

  మొత్తం నికర ఆదాయం ఎంత?

  టాలీవుడ్ సీనియర్ హీరో కమ్ పొలిటీషియన్ రెబెల్ స్టార్ కృష్ణంరాజుకు ఒక ఏడాదికి 5 - 6 కోట్ల రూపాయల వరకూ ఆదాయం వస్తుందని తెలుస్తోంది. అంతేకాదు, ఆయన నికర ఆదాయం రూ. 350 - 400 కోట్లు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల కోసం డబ్బును ఖర్చు చేస్తూనే ఉంటున్నారు.

  English summary
  Famous Actor Krishnam Raju Passes Away Due to Health Issues. Let we Know about his Net Worth, assets and Remuneration Deatails.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X