For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishnam Raju First Wife: కృష్ణంరాజు మొదటి భార్య బ్యాగ్రౌండ్? ఆమె ఎలా చనిపోయారో తెలిస్తే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రెబెల్ స్టార్ కృష్ణంరాజు. విలక్షణమైన నటనతో విభిన్నమైన చిత్రాలను చేసిన ఆయన.. ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నారు. తద్వారా మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నారు.

  ఇలా చాలా ఏళ్ల పాటు టాలీవుడ్‌లో హవాను చూపించారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 11న కృష్ణంరాజు కన్నుమూశారు. దీంతో ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెబెల్ స్టార్ మొదటి భార్య ఎవరు? ఆమె ఎలా చనిపోయారు? అనే విషయాలను తెలుసుకుందాం పదండి!

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

  చాలా రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు (83).. ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తుండగానే పరిస్థితి విషమించింది. దీంతో ఆయన గత ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు చనిపోయారు.

  బాత్రూంలో ప్రణిత హాట్ సెల్ఫీ: తల్లైన కొద్ది రోజులకే జాకెట్ విప్పేసి మరీ!

  కృష్ణంరాజు కోసం కదిలిన టాలీవుడ్

  కృష్ణంరాజు కోసం కదిలిన టాలీవుడ్

  సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు టాలీవుడ్‌కు చెందిన బిగ్ స్టార్స్ అంతా కదిలి వస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు మోయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లో జరుగుతాయి.

  కృష్ణంరాజు ఫ్యామిలీపై ప్రచారాలు

  కృష్ణంరాజు ఫ్యామిలీపై ప్రచారాలు

  కృష్ణంరాజు మృతితో ఆయన గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెబెల్ స్టార్ ఫ్యామిలీ వివరాలను గూగుల్‌లో చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. అలాగే, ప్రభాస్‌తో కృష్ణంరాజుకు ఉన్న రిలేషన్ గురించి కూడా ఎంతో మంది నార్త్ వాళ్లు గూగుల్‌లో వెతుకుతుండడం గమనార్హం.

  యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!

  కృష్ణంరాజు మొదటి భార్య గురించి

  కృష్ణంరాజు మొదటి భార్య గురించి

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన మొదటి భార్య గురించి కూడా చాలా విషయాలు హైలైట్ అవుతున్నాయి. అయితే, అసలు ఆమె ఎవరు? ఎలా చనిపోయారు? ఆమెకు పిల్లలు ఉన్నారా? అనే విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక, మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. కృష్ణంరాజు మొదటి భార్య పేరు సీతాదేవి. ఆమె రెబెల్ స్టార్‌కు వరుసకు మేనకోడలు అవుతుంది.

  షూటింగ్ నుంచే పెళ్లి పీటలెక్కారు

  షూటింగ్ నుంచే పెళ్లి పీటలెక్కారు

  సీతాదేవితో కృష్ణంరాజు వివాహం మే 10, 1969న జరిగింది. అప్పుడు రెబెల్ స్టార్ సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించిన 'అమ్మ కోసం' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పెళ్లికి ముందు వరకూ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన.. ముహూర్తం సమయానికి వచ్చి సీతాదేవి మెడలో తాళి కట్టారు. దీనికి సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల సహా యూనిట్ మొత్తం వచ్చింది.

  హాట్ షోతో షాకిచ్చిన రమ్యకృష్ణ: వామ్మో ఈ వయసులో కూడా ఇలాంటి ఫొటోలా!

  సీతాదేవి ఎలా చనిపోయారో తెలిస్తే

  సీతాదేవి ఎలా చనిపోయారో తెలిస్తే

  రెబెల్ స్టార్ కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి 1995లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఆమె వ్యక్తిగత పని మీద ప్రయాణం చేస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. సీతాదేవి మరణంతో కృష్ణంరాజు చాలా రోజుల పాటు మానసికంగా కృంగిపోయారు. కానీ, కెరీర్‌పై మాత్రం ఆ ప్రభావాన్ని పడనీయకుండా జాగ్రత్తలు పడ్డారు.

  శ్యామలా దేవితో రెండో వివాహం

  శ్యామలా దేవితో రెండో వివాహం

  మొదటి భార్య సీతాదేవి మరణం తర్వాత రెబెల్ స్టార్ కృష్ణంరాజు.. కొన్ని నెలల పాటు ఒంటరి జీవితాన్ని అనుభవించారు. ఈ సమయంలోనే కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో ఆయన శ్యామలా దేవిని 1996వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె ప్రసీద 'రాధే శ్యామ్' మూవీకి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

  English summary
  Famous Actor Krishnam Raju Passes Away Due to Health Issues. Let we Know about his First and Second Wife Details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X