కేటీఆర్‌కు మంచు లక్ష్మీ ఊహించని ట్వీట్: అలా చూస్తే ముందే పోతారంటూ నెటిజన్ల సెటైర్!

మంచు లక్ష్మీ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని సినీ రంగంలో రాణిస్తోందామె. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, నిర్మాతగా ఇలా ఎన్నో విభాగాల్లో తన మార్కును చూపించి ఆకట్టుకుంది. అదే సమయంలో కొన్ని విషయాలపై సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ గురించి ఆమె చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగింది? అందులో ఏముంది?

అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

అలా మొదలైన కెరీర్.. తెలుగులో కాదు

అలా మొదలైన కెరీర్.. తెలుగులో కాదు

మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచు లక్ష్మీ.. ముందుగా ఇంగ్లీష్ సినిమా 'ద ఓడ్'తో నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'డియర్ ఎయిర్' అనే మూవీలోనూ నటించిందామె. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో 'లక్ష్మీ టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చిందీ మంచు వారి అమ్మాయి. అలా కెరీర్‌ను మొదలు పెట్టింది.

తక్కువే చేసినా.. గుర్తింపు మాత్రం అలా

తక్కువే చేసినా.. గుర్తింపు మాత్రం అలా

తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది మంచు లక్ష్మి. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత 'గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను అందుకుంది. ఇలా చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. పేరుతో పాటు గుర్తింపును దక్కించుకుందామె.

ఎప్పుడూ అందులోనే... అన్నీ చెబుతూ

ఎప్పుడూ అందులోనే... అన్నీ చెబుతూ


సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మి ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. అలాగే ఎన్నో విషయాలపై స్పందిస్తూ హల్‌చల్ చేస్తుందీ బ్యూటీ.

మంత్రి కేటీఆర్‌కు కరోనా.. ఇండస్ట్రీ వాళ్లు

మంత్రి కేటీఆర్‌కు కరోనా.. ఇండస్ట్రీ వాళ్లు

తెలంగాణలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆయన.. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వాళ్లందరూ టెస్టులు చేయించుకోమని సలహా కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.

కేటీఆర్‌కు మంచు లక్ష్మీ ట్వీట్ చేసిందలా

కేటీఆర్‌కు మంచు లక్ష్మీ ట్వీట్ చేసిందలా


సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి అంశంపై స్పందిస్తూ ఉండే ప్రముఖ నటి మంచు లక్ష్మీ.. కేటీఆర్ కరోనా బారిన పడడంపై తనదైన శైలిలో ట్వీట్ చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'నువ్వు త్వరగా కోలుకోవాలి బడ్డీ.. ఇప్పుడు నా సినిమాలన్నీ చూడు' అంటూ పోస్టు చేసింది. దీంతో ఈ ట్వీట్‌కు సంబంధించిన స్క్రిన్ షాట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.

 దాని కంటే కరోనానే బెస్ట్ అంటూ కొందరు

దాని కంటే కరోనానే బెస్ట్ అంటూ కొందరు

కేటీఆర్‌ను తన సినిమాలు చూడమంటూ మంచు లక్ష్మీ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 'నీ సినిమాలు చూడడం కంటే కరోనాతో పోరాడడమే బెస్ట్' అని కొందరు అంటుండగా.. 'నువ్వు చేసిన సినిమాల్లో మంచిది ఏదో ఒకటి చెప్పు' అంటూ మరికొందరు రిప్లై ఇస్తున్నారు. ఇంకొందరైతే.. 'నీ పోస్ట్ చూసి ఆయన చనిపోయి ఉంటాడు' అని ట్రోల్స్ చేస్తున్నారు.

 అంత మాట అనడంతో ఊహించని విధంగా

అంత మాట అనడంతో ఊహించని విధంగా

మంచు లక్ష్మీ చేసిన ట్వీట్‌లో కేటీఆర్‌ను బడ్డీ అనడంపైనా ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు ఆమె పోస్టు కింద 'బడ్డీ ఏంది? కేటీఆర్ గారు నీ దోస్తా? ఒక రాష్ట్రానికి మంత్రి. గౌరవంగా మాట్లాడడం నేర్చుకో' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు, 'మీరంటే మాకు గౌరవం. విష్ చేసినందుకు థ్యాంక్స్. కానీ అలా సంభోదించడం నచ్చలేదు' అని రిప్లై ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X