For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరును పట్టించుకోని ఆ ముగ్గురు.. ప్రభాస్, బన్నీ, మహేష్ ఇంకా సైలెంట్‌గానే.. అప్పుడే వేడి చల్లారిందా?

  |

  ఏదైనా వేడి ఉన్నంత వరకు రుచి బాగుంటుందంటారు. మధ్యలో నీరు పోసి.. ఉన్నవేడిని తుస్సుమనిపించేవారు కొందరుంటారు. టాలీవుడ్‌లో వీర లెవెల్లో దూసుకుపోయిన ఓ ఛాలెంజ్ ప్రస్తుతం తుస్సుమంది. ఎవరికి సవాల్ విసిరితే లాభం ఉంటుందో, దాన్ని ముందుకు తీసుకువెళ్తారనే నమ్మకం ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఛాలెంజ్ చేయాలి. కాదు కూడదని చేస్తే ఇలాగే తయారవుతుంది యవ్వారం. అప్పటి వరకు దుమ్ములేపిన ఛాలెంజ్ ప్రస్తుతం పత్తా లేకుండా పోయింది. అసలు ఎక్కడ చైన్ బ్రేక్ అయిందో ఓ సారి చూద్దాం.

  అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో మొదలు..

  టాలీవుడ్‌లో ప్రస్తుతం వైరల్ అవుతోన్న ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. Be The Real Man అంటూ సాగుతున్న ఈ ఛాలెంజ్ శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా వేళ అందరూ ఇంటి పట్టునే ఉండటంతో మహిళలపై పని భారం పెరుగుతోంది. ఈ మేరకు మగవారంతా మహిళలకు ఇంటి పనుల్లో సాయం చేయాలని, నిజమైన మనిషి అనిపించుకోవాలని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్‌ను మొదలుపెట్టాడు.

  మొదటి ఫేజ్ విజయవంతం..

  ఈ ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను రాజమౌళి మీద పెట్టాడు సందీప్ రెడ్డి వంగా. ఈ మేరకు రాజమౌళి తన వంతుగా టాస్క్‌ను పూర్తి ఎన్టీఆర్, రామ్ చరణ్, సుకుమార్, కీరవాణి, శోభు యార్లగడ్డలకు తదుపరి ఛాలెంజ్‌ను విసిరాడు. ఈ మేరకు అందరూ తమ వంతుగా ఇంట్లో పనులు చేస్తూ ఉన్న వీడియోలు షేర్ చేశారు. రాజమౌళి సవాల్‌కు అందరూ స్పందించి రెండో ఫేజ్‌లోకి తీసుకెళ్లారు.

  రెండో ఫేజ్ అద్భుతం..

  ఇక రాజమౌళి నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన ఎన్టీఆర్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జునలతో పాటు కొరటాల శివకు ఛాలెంజ్ విసిరాడు. శోభు యార్లగడ్డ ప్రభాస్, బన్నీలకు.. దేవీ శ్రీ ప్రసాద్, దిల్ రాజు, వంశీ పైడిపల్లిలకు సుకుమార్ ఛాలెంజ్ విసిరాడు. శర్వానంద్, యూవీ క్రియేషన్ విక్కికీ రామ్ చరణ్ సవాల్ విసిరాడు. కీరవాణి సైతం ఇంటి పనులు చేసి తమన్ వంటివారికి విసిరాడు. ఇలా రెండో ఫేస్ అద్భుతంగా సాగింది.

  వెంకీ, చిరు మాత్రమే..

  మూడో ఫేజ్‌లోకి అడుగుపెట్టిన ఈ ఛాలెంజ్‌లో వేడి తగ్గింది. బాలయ్య, చిరు, వెంకీ, నాగ్, ప్రభాస్, బన్నీ, మహేష్, దేవీ శ్రీ ప్రసాద్ ఇలా ఎంతో మంది వద్దకు ఈ ఛాలెంజ్ వెళ్లింది. అయితే చిరంజీవి, వెంకటేష్ మాత్రమే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి ముందుక తీసుకెళ్లారు.

  స్థంభించిపోయిన సవాల్..

  స్థంభించిపోయిన సవాల్..

  ఇంటి పనులు చేసిన రియల్ మ్యాన్ అనిపించుకున్న చిరు.. కేటీఆర్, మణిరత్నం, రజినీలకు సవాల్ విసిరాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. చిరు ట్వీట్‌కు కనీసం స్పందించలేదు. ఇక రజినీ, మణిరత్నంల స్పందన గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచింది. దీంతో ఇక్కడ పుల్ స్టాప్ పడింది. ఈ ముగ్గురును చిరును అసలు లెక్కలోకే తీసుకోలేదు.

  Vijay Devarakonda Be The Real Man Challenge Video
  స్పందించని ప్రభాస్, బన్నీ, మహేష్..

  స్పందించని ప్రభాస్, బన్నీ, మహేష్..

  స్టార్ హీరోలైన ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించని అంతా భావించారు. దానికి తగ్గట్టే ఇప్పుడు వీరు నిశ్శబ్దంగానే ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే బన్నీ, మహేష్ కనీసం ఓ ట్వీట్ కూడా వేయలేకపోయారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్, రవితేజ వంటివారు కూడా స్పందించడం లేదు. ఇక దీంతో ఈ ఛాలెంజ్ పూర్తిగా సమాధి అయినట్టే కనిపిస్తోంది.

  English summary
  KTR ManiRatnam And Rajinkanth Ignored Chiranjeevi Challenge. Prabhas, Allu Arjun ANd Mahesh Babu Also Ignored Be The Real Man Challenge. They Made This Challenge Disaster.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X