టాయిలెట్స్ కూడా కడుగుతా.. అందుకే అలా ఉన్నానన్న నాటి హీరోయిన్
కుష్బూ సుందర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అక్కర్లేదు. వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ..స్టార్స్ అందరి సరసన నటించింది. తెలుగులోకంటే తమిళ నాట కుష్భుకు ఎనలేని క్రేజ్ ఉంటుంది. అక్కడ ఏకంగా కుష్భూకు గుడి కూడా కట్టేశారంటే ఆమె రేంజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పవర్ ఫుల్ పాత్రలే వచ్చినా కానీ ఎందుకో అంత సక్సెస్ కాలేకపోయింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా స్టాలిన్ సినిమాలో చిరంజీవి అక్కగా, యమదొంగ సినిమాలో యముడికి భార్యలా నటించి మంచి మార్కులు కొట్టేసింది. రీసెంట్‌గా అజ్ఞాతవాసి సినిమాలోనూ నటించింది. అయితే ఆ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసిందనుకోండి. అయితే కుష్భూ ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఆమె వేసే ట్వీట్స్ ఒక్కోసారి రాజకీయాల్లో పెను దుమారాన్ని లేపుతుంది.

తాజాగా రజినీ రాజకీయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. రజినీ కింగ్ మేకర్‌లా ఉండకూడదు.. కింగ్‌లా ఉండాలని కోరుకుంది. తాజాగా ఆమె ఫిట్‌నెస్‌ను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటి? లాక్ డౌన్‌లో ఇదేలా సాధ్యమైందని ప్రశ్నల వర్షం కురిపించగా వాటికి సమాధానం ఇచ్చింది. 'నేను ఇలా మార్పు చెందడంపై ఎంతో మంది ప్రశ్నలు కురిపిస్తున్నారు. కేవలం లాక్ డౌన్ వల్లే ఇది సాద్యం కాలేదు. ఎవ్వరి సాయం లేకుండా ఈ 70రోజులు ఇంట్లో పనులన్నీ చేశాను. ఊడ్వడం, దుమ్ముదులపడం, బోళ్లు బొచ్చలు కడగడం, గార్డెనింగ్, టాయిలెట్లు సైతం కడగటం వంటివన్నీ ముఖ్యపాత్రను పోషించాయి. అన్నింటికి మించి నేను తిండిబోతును కాద'ని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











