రేప్ చేస్తామని బెదిరింపులు.. అలాంటి వాడికి ఇలానే పరువు తీయాలి.. సీఎంను వేడుకున్న కుష్బూ
సోషల్ మీడియాలో బెదిరింపులు రావడం సహజమే. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఇది సర్వసాధారణమైంది. రేప్ చేస్తాం, చంపుతామని వచ్చే బెదిరింపులపై కొందరు హీరోయిన్లు లైట్ తీసుకుంటే మరి కొందరు సీరియస్ అవుతుంటారు. అయితే చిన్న హీరోయిన్లు, మామూలు వారికి ఇలాంటి బెదిరింపులు వస్తే అంతగా ఆశ్చర్యపోరు కానీ తెరపై హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పోషిస్తున్న కుష్బూ లాంటివారికి కూడా బెదిరింపులు వచ్చాయంటే అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

సోషల్ మీడియాలో యాక్టివ్..
కుష్బూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. సినీ రాజకీయ అంశాలతో పాటు, సామాజిక సమస్యలపైనా స్పందిస్తుంది. ఎవరైన మహిళలు సాయం కోరితే వెంటనే సోషల్ మీడియాలో స్పందింస్తుంది. చేతనైనా సాయం చేస్తుంది. లాక్ డౌన్ సమయంలో కుష్బూ అందరికీ అందుబాటులోనే ఉంది.

రేప్, హత్యా బెదిరింపులు..
అలాంటి కుష్బూకే రేప్ చేస్తామని, హత్య చేస్తామని ఓ దుండగుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. సదరు నంబర్‌ను ఏకంగా సోషల్ మీడియాలోనే పెట్టేసింది. ట్రూ కాలర్‌లో వచ్చిన పేరును బట్టి, అడ్రస్‌ను బట్టి సదరు వ్యక్తిని ఓ రేంజ్‌లో ఆడుకుంది. ఇష్టమొచ్చినట్టు తిట్టింది.

అలాంటి వ్యక్తి కుటుంబం..
అయితే ఇలా నంబర్‌ను బహిర్గత పర్చడంపై ఓ నెటిజన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దానికి కుష్బూ స్పందించింది. అలాంటి పనులు చేసే వాడిని ఇలానే చేయాలి, పబ్లిక్‌గా పరువుదీయాలని, వాడికి కూడా కుటుంబం ఉంటుంది కదా అని ఫైర్ అయింది. కుష్బూ ముస్లిం కావడంతోనే ఇలా బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పుకొచ్చాడట.
Recommended Video

సీఎంకు ఫిర్యాదు..
అతని నంబర్ కోల్ కత్తాకు చెందినదని తెలుసుకున్న కుష్బూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేసింది. దీదీ నాకే ఇలాంటి బెదిరింపులు ఎదురువుతున్నాయంటే మిగిలిన మహిళల పరిస్థితి ఏంటో అని ఆలోచించండని వేడుకుంది.


Click it and Unblock the Notifications











