సుశాంత్ మృతి.. కరణ్ జోహర్‌పై ట్రోలింగ్.. ఆ హక్కు మీకు ఎక్కడిదని కుష్భూ ఫైర్

ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా.. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కరణ్ జోహర్‌కు చుట్టుకుంటోంది. బాలీవుడ్‌లోని బంధుప్రీతి, మాఫియా, కరణ్ జోహరే పరోక్షంగా సుశాంత్ మరణానికి కారణమని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ మేరకు నేటి ఉదయం నుంచి కరణ్ జోహర్ పేరు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూనే వస్తోంది. అంతా కలిసి సుశాంత్‌ను హత్య చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఉదయం నుంచి ట్రెండ్..

ఉదయం నుంచి ట్రెండ్..

సుశాంత్ ఆదివారం (జూన్ 14) బాంద్రాలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ ఆత్మహత్య విషయం సోషల్ మీడియాలో దావానంలా వ్యాప్తి చెందింది. డిప్రెషన్ కారణంగానే సుశాంత్ మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. అయితే ఆ డిప్రెషన్‌కు కారణం మాత్రం బాలీవుడ్‌లోని మాఫియా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు కరణ్ జోహర్ పేరును ట్రెండ్ చేస్తున్నారు.

కంగనా వీడియోలు వైరల్..

కంగనా వీడియోలు వైరల్..


బాలీవుడ్‌లోని గుత్తాధిపత్యం, నెపోటిజం, వారసత్వంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిత్యం గళమెత్తుతూనే ఉంటుంది. అయితే నేడు ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కంగనా నిజం మాట్లాడిందని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో ధైర్యంగా వారిని ఎదురిస్తోందని పోగడ్తలు కురిపించారు.

కరణ్ జోహర్‌పై ట్రోల్స్..

కరణ్ జోహర్‌పై ట్రోల్స్..


అయితే సుశాంత్ మృతికి పరోక్షంగా కరణ్ జోహర్, అతని మాఫియానే కారణమని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అతనికి ధర్మ ప్రొడక్షన్స్‌లో ఛాన్స్‌లు ఇవ్వలేదని, గతంలో కాఫీ విత్ కరణ్ షోలో కూడా సుశాంత్‌ను కించపరిస్తూ అలియాతో కలిసి పగలబడి నవ్వారని గుర్తు చేసుకుంటున్నారు.

ఒంటరిగా వదిలేయండి..

ఒంటరిగా వదిలేయండి..

అయితే నేటి ఉదయం నుంచి కరణ్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌పై కుష్భూ స్పందించింది. ‘మీరు చేసే జడ్జ్‌మెంట్‌తో, మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది.. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టుగా తిడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. చాలా మంది అలానే చేస్తున్నారు.. అది కూడా కరణ్ జోహర్ మీద. ఆయన గురించి వ్యక్తిగతంగా మీకు తెలీదు. అలాంటప్పుడు ఆయన ఎలాంటి వారో చెప్పే హక్కు మీకు ఎక్కడిది? అతడిని ఒంటరిగా వదిలేయండ'ని ఫైర్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X