అమానవీయ ఘటన.. ఒళ్ళు జలదరించేలా.. ఎప్పుడు నేర్చుకుంటారంటూ ఖుష్బూ ఆవేదన
సోషల్ మీడియాలో ఒక్కోసారి కొన్ని ఘటనలు దేశం మొత్తానికి కుదిపేస్తుంటారు. కొన్ని సంఘటనలు అందరినీ కదిలిస్తుంటాయి. మనుషులతో పాటు అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని కొన్ని కొన్ని దారుణాలను చూసిన తరువాతే గుర్తుకు వస్తుంది. ఈ క్రమంలో కొన్ని జంతువులను మనుషులు హింసించడం, దారుణం చంపడం చూసి సమాజం మొత్తం చలించిపోతుంది. ఆ మధ్య ఒకసారి ఇలాంటి ఓ దారుణమైన ఘటన జరిగింది.

ఏనుగుపై కర్కశత్వం..
కేరళలో ఓ ఏనుగుపై ఆకతాయిలు తమ పైశాచికత్వాన్ని చూపించారు. ఆకలితో అలమటిస్తోన్న ఏనుగుకు తినడానికి పండ్లు ఇచ్చినట్టుగా ఇస్తూనే అందులో పేలుడు పదార్థాలను అమర్చారు. అది తెలియన ఏనుగును మనిషిని నమ్మేసింది. వాటిని తినే సమయంలో పేలడంతో దారుణమైన స్థితిలో మరణించింది.

ఆగ్రహించిన సమాజం..
అలా ఏనుగును కిరాతకంగా హింసించి చంపడంతో సమాజం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ కూడా ఏనుగుపై చేసిన కిరాతకాన్ని ఖండించారు. వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా అలాంటి ఓ ఘటనే మళ్లీ జరిగింది.

డాల్ఫిన్‌ను కొట్టి మరి..
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో కొందరు ఆకతాయిలు.. డాల్పిన్ కొట్టి కొట్టి చంపారు. గొడ్డలి, కర్రలతో కొట్టి కొట్టి దాని రక్తాన్ని కళ్ల చూశారు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తోంది. ఈ దారుణమైన ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

భయంకరమైన ఘటన..
డాల్పిన్‌ను అలా హింసించి చంపడంపై కుష్బూ స్పందించాడు. ఎంతో భయంకరంగా ఉందంటూ కామెంట్ చేసింది. ఇలాంటి వారు ఇంకెప్పుడు నేర్చుకుంటారు? అంటూ సాటి జీవాలను బ్రతికే హక్కు లేదా అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ కదిలిస్తోంది.


Click it and Unblock the Notifications











