Kushitha Kallapu: మహేశ్ మూవీలో చీజ్ బజ్జీ గర్ల్.. పబ్ కేసు తర్వాత లక్కీ ఛాన్స్.. ఎవరీ కుషిత కల్లాపు?

'అతడు', 'ఖలేజా' వంటి క్రేజీ మూవీల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రమే 'గుంటూరు కారం'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి.

అందుకు తగ్గట్లుగానే దీన్ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ చిత్రంలో ఎంతో మంది ప్రముఖ నటులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీలో ఓ క్రేజీ రోల్ కోసం 'చీజ్ బజ్జీ గర్ల్'గా ఫేమస్ అయిన కుషితను తీసుకున్నారు. ఆ వివరాలు మీరే చూడండి!

Kushitha Kallapu Key Role in Mahesh Babu Guntur karam Movie

గుంటూరు కారం అంటూ కొత్తగా: మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమే 'గుంటూరు కారం'. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు.

షూటింగ్ ట్రబుల్స్‌తో ఇబ్బంది: ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'గుంటూరు కారం' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని బ్రేకులు రావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పున: ప్రారంభం అయింది.

Kushitha Kallapu Key Role in Mahesh Babu Guntur karam Movie

మహేశ్ మూవీలో కుషిత కల్లాపు: సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గుంటూరు కారం' మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ముఖ్యంగా పలువురు అమ్మాయిలు మంచి మంచి రోల్స్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబర్ కుషిత కల్లాపు ఈ సినిమాలో అదిరిపోయే పాత్రను చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

Kushitha Kallapu Key Role in Mahesh Babu Guntur karam Movie

ఆ నాటీ రోల్‌లోనే క్రేజీ బ్యూటీ: మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెకెక్కుతోన్న 'గుంటూరు కారం' మూవీలో ఫేమస్ యూట్యూబర్ కుషిత కల్లాపు ఓ నాటీ రోల్‌లో నటిస్తున్నట్లు కూడా తాజాగా వార్తలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఇందులో ఈ అమ్మడు మహేశ్ బాబు పాత్రను పడేసే ప్రయత్నాలు చేసే రోల్‌ను చేస్తుందట. ఇందుకోసం కుషిత కాస్త గ్లామర్ షో కూడా చేస్తుందని తెలిసింది.

Kushitha Kallapu Key Role in Mahesh Babu Guntur karam Movie

ఇంతకీ ఎవరీ కుషిత కల్లాపు?: మహేశ్ బాబు మూవీలో కుషిత కల్లాపు ఆఫర్ అందుకున్న విషయం లీకైన తర్వాత ఈమె గురించి చాలా మంది ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టేశారు. ఇంతకీ ఈ భామ ఎవరంటే.. కుషిత యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఇలా యూట్యూబ్ సీరిస్‌లు, షార్ట్స్, ఇన్‌స్టాలో రీల్స్ వంటివి చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. దీంతో చాలా సినిమాల్లో కూడా ఆఫర్లు అందుకుంది.

Kushitha Kallapu Key Role in Mahesh Babu Guntur karam Movie

ఆ పబ్ కేసుతోనే వెలుగులోకి: కొన్నేళ్ల క్రితం హైదరాబాదులోని ఓ పబ్‌లో అధికారులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో పోలీసులు పలువురు సెలబ్రిటీలను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో మెగా డాటర్ నిహారిక కూడా ఉంది. ఈమెతో పాటే కుషిత కల్లాపు కూడా అప్పుడు పోలీసుల విచారణను హాజరైంది. దీంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ వెలుగులోకి వచ్చింది.

Kushitha Kallapu Key Role in Mahesh Babu Guntur karam Movie

చీజ్ బజ్జీ గర్ల్‌గా సంచలనం: కుషిత కల్లాపు సంచలనంగా మారడానికి పబ్ కేసు తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్‌మెంటే కారణం. పోలీసుల విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఈ బ్యూటీ 'నేను ఫ్రెండ్స్‌తో కలిసి చీజ్ బజ్జీ తినడానికే పబ్‌కు వెళ్లాను' అని చెప్పింది. దీంతో పబ్‌కు ఎవరైనా బజ్జీ తినడానికి వెళ్తారా అంటూ అప్పట్లు కుషితను అంతా ట్రోల్ చేశారు. అలా ఈమెకు 'చీజ్ బజ్జీ గర్ల్' అనే పేరు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X