స్లిమ్ లుక్కుతో షాకిచ్చిన లేడి కమెడియన్.. లాక్‌డౌన్‌లో గట్టిగానే కరిగించింది!

లాక్ డౌన్ ఒక విధంగా బిజీగా ఉండే నటీనటులకు ఒక కొత్త తరహా మార్పును తీసుకువచ్చిందనే చెప్పాలి. హాలిడేస్ లా కాకుండా భవిష్యత్తు ప్రణాళికల కోసం స్పెషల్ డేస్ అనేలా సెట్ చేసుకున్నారు. కొందరైతే ఫిట్నెస్ విషయంలో భారీ మార్పులే తీసుకొచ్చారు. అలాంటి వారిలో ఎక్కువగా షాకిచ్చింది మాత్రం లేడి కమెడియన్ విద్యుల్లేఖ అనే చెప్పాలి. లాక్‌డౌన్‌లో ఆమె బరువును చాలానే కరిగించినట్లు తెలుస్తోంది.

ఊహించని విధంగా..

ఊహించని విధంగా..

విద్యుల్లేఖ అనగానే ఆమె చేసిన కామెడీ సన్నివేశాలు చాలానే గుర్తొస్తాయి. తమిళ టీవీ నటుడు మోహన్ రామన్ కుతురైన విద్యుల్లేఖ లుక్ తోనే వెండితెరపై జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు ఆమె ఎవరు ఊహించని విధంగా మారిపోయింది. నేటితరం యంగ్ హీరోయిన్స్ లాగా చాలా స్లిమ్ గా మారి నెటీజన్స్ కి షాకిచ్చిందనే చెప్పాలి.

కసిగా వర్కౌట్స్ చేసి

కసిగా వర్కౌట్స్ చేసి

సాధారణంగా నటీమణులు వారి అందంతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటారు. కానీ ఈ చబ్బీ సుందరి మాత్రం తన బొద్దైన ఆకరంతోనే ఆడియెన్స్ ని నవ్విస్తుంది. ఈ లాక్ డౌన్ లో ఆమె పూర్తిగా తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి కసిగా వర్కౌట్స్ చేసి నాజూకు నడుముతో దర్శనమిచ్చింది.

జాగ్రత్తగా ఉపయోగించుకొని..

జాగ్రత్తగా ఉపయోగించుకొని..

అసలైతే గత ఏడాది నుంచే విద్యుల్లేఖ సన్నాబడాలని చూస్తోంది. ఆ మధ్య మళ్ళీ బరువు పెరిగినట్లు అనిపించినప్పటికీ ఈ లాక్ డౌన్ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఇంకా నాజూగ్గా తయారయ్యింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recommended Video

Malli Malli Chusa Movie Public Talk | Anurag Konidena | Shweta Avasthi
తెలుగు సినిమాలతోనే..

తెలుగు సినిమాలతోనే..

ఇక అమ్మడు తమిళ్ నటి అయినప్పటికీ ఎక్కువగా తెలుగు సినిమాలతోనే బిజీ అవుతోంది. సరైనోడు, రాజుగారి గది వంటి సినిమాల్లో విద్యుల్లేఖ చేసిన పాత్రలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. దీంతో 2018 నుంచి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా తెలుగు సినిమాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X