కోపంలో కొందరు రచయితలు.. ప్రస్టేషన్‌లో ఆ పని చేయను.. లక్ష్మీ భూపాల
'చందమామ', 'అలా మొదలైంది', 'మహాత్మ', 'టెర్రర్', 'నేనే రాజు నేనే మంత్రి', 'కల్యాణ వైభోగమే' చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్. ఇటీవల విడుదలైన 'ఓ బేబీ'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే, లక్ష్మీ భూపాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.
నాకు దర్శకుడిగా మారాలానే కోరిక ఉంది. ప్రస్తుతం కొందరు రచయితలు ఫ్రస్ట్రేషన్‌లో దర్శకులు అవుతున్నారు. తాము రాసినది దర్శకులు సరిగా ఆవిష్కరించడం లేదనే కోపంలో దర్శకులుగా మారుతున్నారు. నేను ఫ్రస్ట్రేషన్‌లో, కోపంలో దర్శకుడు కావాలని అనుకోవడం లేదు. నేను మాత్రమే కథకు న్యాయం చేయగలని భావించిన రోజున మెగాఫోన్ పడతా. నా దగ్గర మొత్తం 24 కథలున్నాయి. అందులో ఆరు కథలను నా కోసం పక్కన పెట్టుకున్నా. సతీష్ కాసెట్టికి ఒక కథ ఇచ్చాను. అలాగే, రచయితగా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అని లక్ష్మీ భూపాల్ పేర్కొన్నారు.

కాగా, ఓ బేబీ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో లక్ష్మీ భూపాల్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మళ్లీ ప్రశంసలు అందుకొంటానని ఆయన తన అనుభూతిని పంచుకొంటున్నారు. ఓ బేబీ అనంతరం ఆయనకు భారీ ఆఫర్లు వస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











