సుశాంత్ చావు మీద డబ్బులు సంపాదించుకుంటున్నారు.. మీడియాపై మంచు లక్ష్మీ ఫైర్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుపై ఎన్నో రకాలు అనుమానాలు, మరెన్నో భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతూనే ఉన్నాయి. మీడియా పక్షపాతం వహిస్తోందని కావాలనే రియాను టార్గెట్ చేస్తోందని ఓ వర్గం సెలెబ్రిటీలు ఆరోపిస్తున్నారు. అందులో ముఖ్యంగా మంచు లక్ష్మీ, తాప్సీ, విద్యా బాలన్ వంటి వారున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీ ఇలాంటి విషయాల్లో తరుచుగా స్పందిస్తూనే ఉంటుంది. అయితే రియాకు మద్దతుగా మంచు లక్ష్మీ చేసే పోస్ట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి.

Recommended Video

#JusticeForRhea : Sushant Singh పై Taapsee ఆరోపణలు, మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్...! || Oneindia Telugu
నిజమేంటో నాకు తెలియదు

నిజమేంటో నాకు తెలియదు

ఆ మధ్య రియా ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకోవడంతా సానుభూతి పెరిగిపోయింది. ఒక్కసారిగా రియాకు మద్దతు పెరిగిపోయింది. ఆ సమయంలో మంచు లక్ష్మీ స్పందిస్తూ.. నేను ఎవరినైనా సరే ముందు సైలెంట్‌గా గమనిస్తాను. ప్రస్తుతం మీడియా ద్వారా ఒక అమ్మాయి రాక్షసురాలిగా కనిపిస్తోంది. నిజమేంటో నాకు తెలియదు, అదే విధంగా నేను అసలు నిజాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నిజం ఎలాగైనా బయటకు వస్తుందని ఆశిస్తున్నాను. నిజాలు తెలుసుకోకుండా ఒకరిని కించపరచడం కరెక్ట్ కాదు. ఇక వారి కుటుంబ సభ్యుల గురించి కూడా నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం భావ్యం కాదు. అంటూ మంచు లక్ష్మీ సుధీర్ఘమైన పోస్ట్ చేసింది.

భారీ మద్దతు..

భారీ మద్దతు..

మంచు లక్ష్మీ చేసిన ఈ పోస్ట్ నేషనల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. తాప్సీ, విద్యా బాలన్ వంటి వారు స్పందించి.. మంచు లక్ష్మీ చెప్పింది నిజమని మద్దతిచ్చారు. మళ్లీ ఆదివారం రియా సీబీఐ, ఎన్సీబీ విచారణకు వచ్చిన సమయంలో మీడియా ప్రవర్తించిన తీరు, మైకులతో ఆమె మీద పడిపోవడం, ఆ దృశ్యాలపైనా స్పందించింది. తాజాగా మరో పోస్ట్ చేసింది.. ఈసారి మీడియా మొత్తాన్ని ఏకిపారేసింది.

డబ్బులు మాత్రమేనా..

డబ్బులు మాత్రమేనా..

సుశాంత్ మరణం నుంచి ఎక్కువ డబ్బు సంపాదించినందుకు, మన దేశానికి సేవ చేసిన కుటుంబాన్ని నాశనం చేసినందుకు భారత మీడియా ఛానెళ్లకు అభినందనలు. ఈ రోజుల్లో మనస్సాక్షి అంటే ఓ లగ్జరీ అని అర్థం. మీరు నిజంగా సుశాంత్ గురించి పట్టించుకున్నారా లేదా అతనికి ఉన్న ఫేమ్‌ను వాడుకునని డబ్బు మాత్రమే సంపాదించుకోవాలని అనుకున్నారా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

ఇది ఎంతో ముఖ్యం..

ఇది ఎంతో ముఖ్యం..

ఈ దేశానికి ఎంతో మంది మహిళలు, ఎన్నో యేళ్లుగా సేవలు చేస్తూనే ఉన్నారు.. ఈ దేశ పునాదులు కూడా వారే. కానీ ప్రస్తుత మున్న పరిస్థితుల్లో ఇది మళ్లీ గుర్తు చేయడం, చెప్పడం ఎంతో ముఖ్యం. మనమంతా ఒక్కటే అని గ్రహించాలి.. రెండు వేర్వేరు (లింగ వివక్ష కాకుండా)గా చూడకూడదు. జస్టిస్ ఫర్ రియా అంటూ మంచు లక్ష్మీ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X