For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైఫ్ ఫార్ట్‌నర్‌తో బీచ్‌లో మంచు లక్ష్మి ఎంజాయ్: తొలిసారి అలా కనిపించిన అమ్మడు.. వాళ్లంతా షాక్!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఫిల్మ్ ఫ్యామిలీలో మంచు వారి కుటుంబం ఒకటి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి ముగ్గురు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లే మంచు విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి ప్రసన్న. వీళ్ల కెరీర్‌లు గ్రాండ్‌గానే మొదలైనప్పటికీ.. గ్రాఫ్ మాత్రం అంత ఆశాజనకంగా సాగడం లేదు. అయినప్పటికీ జయపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. వీరిలో లక్ష్మి సినిమాల్లో యాక్టివ్‌గా లేకున్నా.. ఏదో రకంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బీచ్ ఫొటోలతో హైలైట్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే...

  మోహన్ బాబు బాటలనే లక్ష్మీ ప్రసన్న

  మోహన్ బాబు బాటలనే లక్ష్మీ ప్రసన్న

  దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్‌ను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. సుదీర్ఘ ప్రయాణంలో విలన్‌గా, హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, నిర్మాతగా ఆయన ఎన్నో రకాలుగా సేవలు అందించారు. ఇక, ఆయన బాటలోనే సోదరులతో కలిసి సినీ ప్రయాణం మొదలు పెట్టింది మంచు లక్ష్మి. ఇప్పటికీ ఆమె యాక్టివ్‌గానే ఉంటోంది.

  ఏకే ఏడాది మూడు రకాల ప్రయాణంతో

  ఏకే ఏడాది మూడు రకాల ప్రయాణంతో

  మోహన్ బాబు కుమార్తెగా సినిమాల్లోకి ప్రవేశించింది మంచు లక్ష్మి. అయితే, ఆమె ఎంట్రీ తెలుగు సినిమాలతో కాదు.. ‘ద ఓడ్' అనే ఇంగ్లీష్ ఫిల్మ్‌తో కావడం విశేషం. ఆ తర్వాత ‘డియర్ ఎయిర్' అనే మూవీలోనూ నటించిందామె. అదే ఏడాది నిర్మాతగానూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ‘లక్ష్మీ టాక్ షో' అనే ప్రోగ్రామ్‌తో బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చిందీ మంచు వారి అమ్మాయి.

  సుదీర్ఘమైన కెరీర్‌.. తక్కువైనా ఎక్కువే

  సుదీర్ఘమైన కెరీర్‌.. తక్కువైనా ఎక్కువే

  తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు' అనే సినిమాతో నటిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది మంచు లక్ష్మి. ఏకంగా ఇందులో నెగెటివ్ రోల్ చేసిన ఈమె.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి'లో అద్భుతమైన నటనతో అవార్డులను అందుకుంది. ఇలా చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. పేరుతో పాటు గుర్తింపును దక్కించుకుందామె.

  అందులో యమ యాక్టివ్.. అన్నింట్లోనూ

  అందులో యమ యాక్టివ్.. అన్నింట్లోనూ

  సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం మంచు లక్ష్మి ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. అలాగే ఎన్నో విషయాలపై స్పందిస్తూ హల్‌చల్ చేస్తుందీ బ్యూటీ.

  భూతల స్వర్గంలో మంచు లక్ష్మి ఫ్యామిలీ

  భూతల స్వర్గంలో మంచు లక్ష్మి ఫ్యామిలీ

  ఈ మధ్యకాలంలో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఈ మధ్య ఎక్కువగా మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మంచు ఫ్యామిలీ కూడా మాల్దీవుల్లో వాలిపోయింది. మంచు మోహన్‌ బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసన్ అక్కడి అందాలను ఆస్వాదించారు. వీటికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

  లైఫ్ ఫార్ట్‌నర్‌తో బీచ్‌లో లక్ష్మి ఎంజాయ్

  లైఫ్ ఫార్ట్‌నర్‌తో బీచ్‌లో లక్ష్మి ఎంజాయ్

  మంచు లక్ష్మి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో మాల్దీవులు ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె వైట్ కలర్ షర్ట్ వేసుకుని ఉంది. అయితే, కింద బుల్లి నిక్కరు మాత్రమే ధరించింది. అందుకు తగ్గట్లుగానే మోహన్ బాబు, ఆమె భర్త కూడా వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్నారు. అప్పటి అనుభూతులను ఇలా గుర్తు చేసుకున్నట్లు ఆ పోస్టు ద్వారా తెలిపింది.

  తొలిసారి అలా కనిపించిన మంచు లక్ష్మి

  తొలిసారి అలా కనిపించిన మంచు లక్ష్మి


  ఇక, మంచు లక్ష్మి వదిలిన ఫొటోల్లో ఆమె భర్త శ్రీనివాసన్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించారు. ఈ టూర్‌లో భార్య భర్తలిద్దరూ ఎంతగా ఎంజాయ్ చేశారో.. వీటిని చూస్తే అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా తొలిసారి తన భర్త, కుమార్తెతో కలిసి ఆమె కనిపించడంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో వీటికి నెటిజన్ల నుంచి విచిత్రమైన కామెంట్లు వస్తున్నాయి.

  English summary
  Manchu Lakshmi Prasanna is an Indian actress, producer, and television presenter who works in Telugu cinema and American television. The daughter of veteran actor Mohan Babu, Lakshmi holds a bachelor's degree in Theatre from Oklahoma City University. Manchu has garnered the SIIMA Award, two Filmfare Awards South, and two State Nandi Awards.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X