Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
బిగ్ బాస్ కంటెస్టెంట్ల కలయిక.. ఎలిమినేట్ అవ్వడంతో అలా.. అదిరిపోయే పిక్!
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక ఆ ఫ్ట్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి ఎక్కడికైన విదేశాలకు వెళ్తుంటారు. లేదా వారి స్నేహితులను కలుస్తుంటారు..లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి చిల్ అవుతుంటారు. అలా పదకొండో వారంలో ఎలిమినేట్ అయిన లాస్య బయటకు వచ్చాక ఫుల్ జోష్‌లో ఉంది. ఎలిమినేట్ అయ్యానని బాధపడని, ఏడుపురాని కంటెస్టెంట్లలో లాస్య ఒకరు. ఎంతో జాలీగా బయటకు వచ్చింది.
స్టేజ్ మీద కూడా..
స్టేజ్ మీద కూడా లాస్య కన్నీరు కార్చలేదు. అందరికీ నవ్వుతూనే చెప్పాల్సినవన్నీ చెప్పేసింది. సూచనలు, సలహాలు, స్వీట్ వార్నింగ్‌లాంటి వన్నీ నవ్వుతూనే ఇచ్చింది. మిగతా కంటెస్టెంట్లలో పాతాళగంగను విప్పలేదు. నవ్వుతూనే బయటకు వచ్చింది.
తాజాగా ఇలా..
బయటకు వచ్చిన లాస్య ఇంటర్వ్యూలంటూ బిజీ అవ్వడం లేదు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడా కూడా హల్చల్ చేయడం లేదు. తాజాగా శ్రీముఖితో కలిసి ఉన్న ఫోటోను లాస్య షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
చాలా రోజుల తరువాత..
చాలా రోజులు తన స్నేహితురాలిని కలిశాను.. చాలా సంతోషంగా ఉందని శ్రీముఖి, లాస్యలు ఇద్దరూ కూడా పోస్ట్‌లు చేశారు. ఇద్దరూ చేసిన పోస్ట్‌లు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆ ఇద్దరూ దిగిన ఫోటోలను చూస్తూ ఉంటే ఎంతో మంచి బంధం ఏర్పడినట్టు కనిపిస్తోంది.
బిగ్ బాస్ ముచ్చట్ల కోసమేనా?
అయితే ఇందులో శ్రీముఖి మూడో సీజన్ రన్నర్, లాస్య తాజాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఇలా ఈ ఇద్దరూ కలిసి బిగ్ బాస్ ముచ్చట్లు పెట్టుకోవడానికే కలిశారా? లేదా ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉందో చూడాలి. ఎందుకంటే శ్రీముఖి ఉమెనియా షోలో లాస్య ఆల్రెడీ పాల్గొంది. మళ్లీ ఏదైనా ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తుందేమోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Recommended Video
యాంకర్ రవితో..
లాస్య, శ్రీముఖి ఇద్దరూ కూడా ప్రస్తుతం యాంకర్ రవికి దూరంగానే ఉంటున్నారు. ఈ ఇద్దరూ కూడా రవికి వ్యతిరేక వర్గం. ఆ మధ్య అసలు లాస్య, శ్రీముఖి మధ్య కూడా మాటలు ఉండేవి కావు. ఎప్పుడైతే శ్రీముఖి రవి మధ్య గ్యాప్ వచ్చిందో.. అప్పటి నుంచి ఆ ఇద్దరూ ఒక్కటయ్యారని తెలుస్తోంది.