అలా చేస్తే ఎంతో సంతృప్తి.. భర్తపై లాస్య కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షోలోకి వెళ్లకముందు లాస్య పర్సనల్ లైఫ్ గురించి ఎవ్వరికీ అంతగా తెలియదు. కానీ బిగ్ బాస్ ఇంట్లో లాస్య చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రెండు సార్లు పెళ్లిళ్లు జరగడం, గర్భవతి అయినా కూడా అబార్షన్ చేయించుకోవడం ఇలాంటి ఎన్నో విషయాలను బిగ్ బాస్ షో ద్వారా బయటపెట్టేసింది. అంతేకాకుండా తమ అన్యోన్య దాంపత్యం గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది లాస్య. తన భర్తపై ఉన్న ప్రేమను లాస్య ఎన్నో సందర్భాల్లో బయటపెట్టేసింది.

ప్రేమ వ్యవహారం..
లాస్య ప్రేమ వ్యవహారం ఐదారేళ్ల క్రితం పెద్ద హాట్ టాపిక్. రెండు సార్లు పెళ్లి చేసుకుందనే రూమర్ కూడా వచ్చింది. కానీ దానిపై లాస్య ఎప్పుడూ స్పందించలేదు. కానీ బిగ్ బాస్ షోలో క్లారిటీ ఇచ్చింది. తనకు రెండు సార్లు పెళ్లి అయిందని, కానీ అది తన భర్తతోనే అని క్లియర్‌గా అన్ని విషయాలను చెప్పుకొచ్చింది.

పెద్దలను ఎదురించి..
లాస్య మంజునాథ్‌ల ప్రేమకు, వివాహానికి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో పూసగుచ్చినట్టు వివరించింది. తన భర్త అనే ఐడెంటిటీ కూడా ఇవ్వకుండా ఆ విషయాన్ని దాదాపు ఏడేళ్ల పాటు దాచి ఉంచానని చెప్పుకొచ్చింది. పెద్దలకు ఇష్టం లేకపోయినా సరే బయటకు వచ్చి మరీ పెళ్లి చేసుకున్నానని, ఆ తరువాత అందరి అంగీకారంతో మళ్లీ వివాహాం చేసుకున్నామని తెలిపింది.

ఏడాది చిన్న..
తన భర్త తనకంటే ఏడాది చిన్న అనే విషయాన్ని కూడా బిగ్ బాస్ షోలోనే బయటపెట్టేసింది. ఈ విషయాన్ని ఇంత వరకు ఎవ్వరికీ చెప్పలేదని, తన ఇంట్లో కూడా ఎవ్వరికీ తెలియదని పేర్కొంది. అలా బిగ్ బాస్ షోలో ఎన్నో పర్సనల్ సీక్రెట్స్ అన్ని బయటకు వచ్చాయి.

ఇప్పుడు ఇలా..
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక లాస్య, మంజునాథ్, జున్నులకు బాగానే పాపులారిటీ పెరిగిపోయింది. అయితే లాస్య తాజాగా తన భర్తకు ఓ స్పెషల్ గిఫ్ట్‌ను ఇచ్చింది. ఆ విషయం గురించి చెబుతూ లాస్య గాల్లో తేలిపోయింది. కారును గిఫ్ట్‌గా ఇచ్చానని చెబుతూ లాస్య సంబరపడిపోయింది.

అంతకంటే సంతృప్తి..
కొత్త కారు కొన్నాం.. ఫైనల్లీ మా ఇంటికి కారును తీసుకొచ్చాం.. మా ఫ్యామిలీలో కారు ఓ మెంబర్ అయిపోయింది.. మా పెళ్లి రోజును ఇలా మంజుకు గిఫ్ట్ ఇవ్వడం ఎంతో హ్యాపీగా ఉంది.. ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన వ్యక్తికి ఇలా గిఫ్ట్‌లు ఇస్తే కలిగే సంతృప్తి ఎందులోనూ ఉండదంటూ లాస్య ఎమోషనల్ అయింది.


Click it and Unblock the Notifications











