సౌందర్య ఇష్టపడ్డ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? ఆయన్ని ఏమని పిలచేదంటే?
దివంగత నటి సౌందర్య తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. కన్నడలో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం మొదలైంది. 1993 నుంచి 2004 వరకు నిర్విరామంగా సినిమాలు చేసింది. ఆమె కెరీయర్ లో 100కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సౌందర్య. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. దక్షిణాది చిత్రాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే సౌందర్య చిన్న వయస్స్ లోనే తుదిశ్వాస విడవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
సౌందర్య 2004 ఏప్రిల్ 17న ఇదే రోజు మరణించడం దురదృష్టకరం. ఎయిర్ క్రాఫ్ట్ పేలడంతో చనిపోయింది. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో తన సోదరుడు అమర్నాథ్ కూడా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటన బెంగళూరు జరిగింది. పొలిటికల్ క్యాంపెయిన్ కు వెళ్తున్న సమయంలో ఇలా ఘోర ప్రమాదం జరగడం అందరినీ కలిచి వేసింది. సౌందర్య లాంటి గొప్ప నటిని కోల్పోయినందుకు సినీ లోకం విచారం వ్యక్తం చేసింది. నేటి సౌందర్య ఈ లోకాన్ని విడిచి 21 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు, నిర్మాణ సంస్థలు సౌందర్య డెత్ యానివర్సరీ సందర్భంగా నివాళ్లులు అర్పిస్తున్నారు.

తమ అభియాన హీరోయిన్ నటించిన సినిమాలను, ఓల్డ్ ఇంటర్వ్యూలను తిరగేస్తున్నారు. ఆమె మెమోరీస్ ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సౌందర్యకు టాలీవుడ్ లో ఇష్టమైన హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే 90 శాతం సినిమాలు చేసింది సౌందర్య, ఇక్కడ వెంకటేశ్, మోహన్ బాబు, చిరంజీవి, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించింది. అయితే సౌందర్యకు ఇష్టమైన ఫేవరెట్ హీరో ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
సౌందర్యకు టాలీవుడ్ లో ఇష్టమైన హీరో వెంకటేశ్ దగ్గుబాటి అని తెలుస్తోంది. ఆయనతో సౌందర్య 7 చిత్రాల్లో నటించి మెప్పించింది. సూపర్ పోలీస్, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం, రాజా, జయం మనదేరా, దేవీ పుత్రుడు వంటి సినిమాలు కలిసి చేశారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే అప్పట్లో వెంకటేశ్, సౌందర్య మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కొన్ని పుకార్లు కూడా నడిచాయి. కానీ అవన్నీ అవస్తావాలని టాలీవుడు మేకప్ మెన్ రాఘవ వెల్లడించారు.
వెంకటేశ్ సౌందర్య ఫేవర్ రేట్ హీరో అని, ఆయన్ని కేవలం సార్ అని మాత్రమే పిలిచేదని చెప్పుకొచ్చారు. అందరితోనూ ఎంతో గౌరవంగా ఉండేదని, ఆమె ప్రవర్తన మెచ్చుకునేదిగా ఉండేదని చెప్పకొచ్చారు. ఎంతో గొప్ప నటి అని కూడా పొగిడారు. ఇక సౌందర్య కర్ణాటకకు చెందినది అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కట్టు, బొట్టు, సంప్రదాయ దుస్లుల్లో కనిపించి తెలుగుదనాన్ని ఉట్టిపడేలా చేసింది. హిందూ సంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇచ్చింది. కెరీయర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి బహుముఖ ప్రజ్ఞాశాలి నటిగా ప్రసిద్ధి చెందింది. సౌందర్య నటించిన అమ్మోరు, పవిత్ర బంధం, రాజా, సూర్యవంశం, ద్వీపం వంటి సినిమాలు ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా చేశాయి.


Click it and Unblock the Notifications











