లావణ్య త్రిపాఠి చేతికి రింగ్.. నిశ్చితార్థం అయిపోయిందా?.. మొత్తానికి అలా బయటపెట్టేసింది!
తెలుగు తెరకు అందాల రాక్షసి చిత్రంతో లావణ్య త్రిపాఠి పరిచయమైంది. మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. అందంతోనూ ఆకట్టుకుంది. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో మొదటి సినిమాతోనే చెరగని ముద్రవేసింది. మధ్యలో లావణ్య త్రిపాఠి కెరియర్ కాస్త స్లో అయినా కూడా మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకువచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం, అర్జున్ సురవరం వంటి చిత్రాలు లావణ్యకు మళ్లీ ఊపిరి పోశాయి.

సోషల్ మీడియాలో రచ్చ..
తెరపై లావణ్య త్రిపాఠి ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెర వెనుకా అంతే సరదాగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో లావణ్య చేసే అల్లరి మరో రేంజ్‌లో ఉంటుంది. లాక్ డౌన్‌లో లావణ్య చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. లాక్ డౌన్ మొత్తాన్ని హైద్రాబాద్‌లో ఒంటరిగానే గడిపేసింది.

సాయం చేసే మంచి మనసు..
లాక్ డౌన్‌లో హైద్రాబాద్‌లోనే చిక్కుపోయిన లావణ్య చుట్టు పక్కల వారి సాయంతో మాస్కులు కుట్టి పంచింది. సీసీసీకి లక్ష రూపాయల విరాళాన్ని ఇచ్చి మంచి మనసును చాటుకుంది. అన్ లాక్ ప్రక్రియ మొదలైన తరువాత.. లావణ్య తన ఇంటి సభ్యులను కలుసుకునేందుకు డెహ్రాడూన్‌కు వెళ్లింది. మళ్లీ ఇప్పుడు షూటింగ్‌ల కోసం హైద్రాబాద్‌కే వచ్చింది.

తారల పెళ్లిళ్లు..
ప్రస్తుతం ఈ ఏడాదిలో తారలు పెళ్లి పీటలెక్కుతున్నారు. మన టాలీవుడ్ తారల్లో నిఖిల్, నితిన్, రానాలు పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వారయ్యారు. ఇక మెగా ఇంట్లో నిహారిక, సాయి ధరమ్ తేజ్‌ల పెళ్లిళ్లు కూడా ఫిక్స్ అయ్యాయి. మరో వైపు కాజల్ పెళ్లి కూడా ఫిక్స్ అయింది. అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూతో పెళ్లి జరగబోతోంది.

నెటిజన్లతో చిట్ చాట్..
సోషల్ మీడియాలో రచ్చ చేసే లావణ్య తాజాగా నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. ఏదైనా అడగండి.. సమాధానం చెబుతాను లెట్స్ డూ దిస్ అంటూ ఓ సెషన్ పెట్టింది. దీంట్లో నెటిజన్లు లావణ్యను పలు రకాల ప్రశ్నలు అడిగింది. ఇందులో ఎక్కువగా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి.
Recommended Video

మీకెందుకు బాధ..
‘మీ చేతికి ఉంగరం ఉంది పెళ్లి ఎప్పుడు' అని ఓ నెటిజన్ అడిగాడు. ‘ఏ ఎందుకు.. అమ్మాయిలు వారిది వాళ్లే ఉంగరాలు కొనుక్కోలేరా?.. అది నాకు నేనుగా ఇచ్చుకున్న బర్త్ డే గిఫ్ట్' లావణ్య అని క్లారిటీ ఇచ్చింది. ఇక మరో నెటిజన్ ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావ్ అక్కా..' అని ప్రశ్నించాడు. దీంతో విసుగెత్తిపోయిన లావణ్య.. ‘మా పేరెంట్స్‌కు లేనిబాధ మీకెందుకు' అని అసహనం వ్యక్తం చేసింది. ఇలా మొత్తానికి పెళ్లి గురించి సంబంధించిన వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











