Mahesh Rejected Movies: మహేశ్ కెరీర్‌లో చేసిన తప్పులు ఇవే.. ఆ హీరోలు స్టార్లు అవడానికి అదే కారణం
లెజెండరీ హీరో కృష్ణ కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చిన్న వయసులోనే తన సత్తాను నిరూపించుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో అత్యుత్తమ నటనతో మెప్పించిన అతడు.. ఆ తర్వాత 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సాగిన సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మహేశ్ తన కెరీర్‌లో కొన్ని హిట్ చిత్రాలను రిజెక్ట్ చేసి తప్పులు చేశాడు. అవేంటో మీరు కూడా చూసేయండి మరి!
నువ్వే కావాలి ఫస్ట్ మహేశ్‌కే : కే విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్ హీరోగా నటించిన చిత్రమే 'నువ్వే కావాలి'. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన స్రవంతి రవికిషోర్ ఈ కథను మహేశ్ బాబుకే వినిపించారట. అలాగే, ఒరిజినల్ మూవీ సీడీని కూడా పంపించారట. కానీ, ఈ చిత్రాన్ని మహేశ్ రిజెక్ట్ చేశాడు. దీంతో తరుణ్ హీరోగా తెరకెక్కించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.


మనసంతా నువ్వేని కూడా : ఉదయ్ కిరణ్ హీరోగా వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'మనసంతా నువ్వే'. ఈ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజు ముందుగా ఈ కథను సూపర్ స్టార్ మహేశ్ బాబుకే వినిపించారట. కానీ, అప్పటి తన ఇమేజ్‌కు ఈ స్టోరీ సెట్ కాదని వద్దన్నాడట. దీంతో మరో ఇండస్ట్రీ హిట్ మహేశ్ బాబుకు దూరం అయింది. ఇక, ఈ చిత్రంతో ఉదయ్ కిరణ్ స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే.

ఫిదా కథ కూడా మహేశ్‌దే : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'ఫిదా'. ప్యూర్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం కూడా మొదట మహేశ్ బాబు చెంతకే వెళ్లింది. కానీ, అతడు కమర్షియల్ హంగులు లేకపోవడంతో చేయనని అన్నాడు. తర్వాత ఇదే చిత్రాన్ని వరుణ్ తేజ్ చేయడం అది అతడి కెరీర్‌నే అత్యధిక కలెక్షన్లను సాధించి బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం జరిగాయి.

పుష్పతో పాటు అవి కూడా : సూపర్ స్టార్ మహేశ్ బాబు రిజెక్ట్ చేసిన చిత్రాల్లో 'పుష్ప' కూడా ఉందన్న విషయం తెలిసిందే. బన్నీ కంటే ముందే ఈ సినిమా కథను దర్శకుడు సుకుమార్ సూపర్ స్టార్‌కు వినిపించాడట. కానీ, దీన్ని అతడు రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. ఇవి మాత్రమే కాదు.. మహేశ్ బాబు రిజెక్ట్ చేసిన చిత్రాల్లో 'ఏమాయ చేశావే', 'వర్షం', 'అ ఆ', 'నాని గ్యాంగ్ లీడర్'లు కూడా ఉన్నాయి.



Click it and Unblock the Notifications











