Independence Day 2024: దేశాన్ని ఊపేసిన దేశభక్తి సినిమాలు

బ్రిటీష్ బానిసత్వం నుంచి స్వేచ్ఛ, స్వయం పాలన కోసం దాదాపు 200 ఏళ్లు పోరాడారు భారతీయులు. ఎందరో మహనీయుల పోరాటం, త్యాగాల ప్రతిఫలంగా 1947 ఆగస్ట్ 15న భరతమాతకు దాస్య శృంఖలాల నుంచి విముక్తి లభించింది.

నాటి నుంచి ఆగస్ట్ 15ని స్వాతంత్ర్య దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్య్రోద్యమం జరిగిన తీరు , మహనీయుల త్యాగాలను మన దర్శక నిర్మాతలు ఎన్నో సినిమాలలో ఆవిష్కరించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అలాంటి సినిమాలను చూస్తే:

list of most patriotic movies here is the details

అల్లూరి సీతారామరాజు :

భరత మాత దాస్య శృంఖలాలను తెంచడానికి మన తెలుగు నేలపై పోరాడిన మన్యం వీరుడు అల్లు సీతారామరాజు. గిరిజనులు, ఆదివాసీలను సైన్యంగా మార్చి బ్రిటీష్ పాలకులను వణికించారు. అల్లూరి జీవితంపై సినిమా తీయాలని ఎందరో భావించగా, సూపర్‌స్టార్ కృష్ణ దానిని సాకారం చేశారు. ఆయన నట జీవితంలోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్‌టైం క్లాసిక్‌గా నిలిచింది అల్లూరి సీతారామరాజు.

రామరాజు ..సీతారామరాజుకు మారిన వైనం, గిరిజనులకు బ్రిటీష్ పాలనలో జరుగుతున్న అన్యాయం, ఆంగ్లేయులపై సీతారామరాజు పోరాటం, ఆయన మరణం తదితర అన్ని అంశాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ చిత్రంలోని తెలుగువీర లేవర పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. శ్రీశ్రీ రచించగా, ఆదినారాయణరావు స్వరాలు, ఘంటసాల మధురగానం జతకలవడంతో జనం ఊగిపోయారు. ఈ పాటకు గాను శ్రీశ్రీకి జాతీయ ఉత్తమ గీత రచయిత పురస్కారం లభించింది.

list of most patriotic movies here is the details

సర్దార్ పాపారాయుడు :

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ మూవీ సర్దార్ పాపారాయుడు . అన్నగారు ఇందులో ద్విపాత్రాభినయం చేస్తారు. ఓ స్వాతంత్ర్య సమరయోధుడు కొందరి వల్ల దేశద్రోహిగా ముద్రపడి జైలుశిక్ష అనుభవించి, తనను జైలుకు పంపిన వారిపై పగ సాధించాడు అన్నదే ఈ సినిమా కథ.

ఇందులో బ్రిటీష్ అధికారిగా మోహన్ బాబు - విప్లవ వీరుడిగా ఎన్టీఆర్ మధ్య సాగే సంభాషణ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే అల్లూరి సీతారామరాజుగా సినిమా తీయాలనుకున్న ఎన్టీఆర్.. ఈ సినిమాలో కాసేపు మన్యం వీరుడిగా నటించి ముచ్చట తీర్చుకున్నారు. సర్దార్ పాపారాయుడు చిత్ర నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.

list of most patriotic movies here is the details

భారతీయుడు :

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కలయికలో వచ్చిన భారతీయుడు సినిమాలో అడుగడుగునా దేశభక్తి కనిపిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుడు.. సమాజంలో పేరుకుపోయిన అవినీతిపై ఎలా పోరాటం చేశాడన్నదే భారతీయుడు కథ. ఇందులో బ్రిటీష్ వారిపై తన మిత్రులతో కలిసి పోరాటం చేయడం, తెల్లవారి చేతుల్లో అఘాయిత్యానికి గురైన యువతిని పెళ్లి చేసుకోవడం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరడం వంటి అంశాలను శంకర్ అద్భుతంగా చూపించారు. ఈ చిత్రంలోని తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే పాట దేశభక్తిని తట్టిలేపుతుంది. కమల్ నటన, శంకర్ టేకింగ్‌తో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మారథం పట్టారు.

list of most patriotic movies here is the details

ఖడ్గం :

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ నటించిన మూవీ ఖడ్గం. దేశభక్తి కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ముష్కర మూకలపై దేశభక్తిని నింపుకున్న హృదయాలు సాగించిన పోరాటంలో భారతీయులదే అంతిమ విజయమని ఖడ్గం చాటి చెప్పింది. ఈ సినిమాలోని మేమే ఇండియన్స్ పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది.

ఇండియాలోనే పుట్టాం.. ఈ మట్టిలోనే కలిసిపోతామంటూ ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత కృష్ణవంశీకి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. దీంతో ఆయన కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది.

list of most patriotic movies here is the details

RRR :

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సాగే ఈ సినిమా గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఎన్టీఆర్, చరణ్ నటన, రాజమౌళి టేకింగ్, పాటలు ఒక ఊపు ఉపాయి. రిలీజై రెండేళ్లు కావొస్తున్నా నిన్న, మొన్న రిలీజైన ఫీలింగ్ కలుగుతోంది. ఆర్ఆర్ఆర్‌కు జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. అన్నింటిలోకి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X